Balaji Mohan: రహస్యపు పెళ్లి.

తెలుగు ప్రేక్షకులకు నటి ధన్య బాలకృష్ణ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధన్య ఎక్కువగా కన్నడ, తమిళం, మలయాళ భాషల చిత్రాల్లో కనిపిస్తోంది. అలాగే తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. సాఫ్ట్ వేర్ సుధీర్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ధన్య బాలకృష్ణ.. నేను శైలజ, రాజు గారి గది వంటి చిత్రాల్లో కూడా నటించింది. ముఖ్యంగా నేను శైలజలో హీరోయిన్ ఫ్రెండ్ గా చేసిన ధన్య బాలకృష్ణ నటనకు మంచి పేరు వచ్చింది.

ధన్య బాలకృష్ణ గురించి ఇప్పటి వరకు ఎక్కువగా రూమర్స్ రాలేదు. కానీ తాజాగా ప్రస్తుతం ఒక వార్త కోలీవుడ్, టాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతుంది. కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్ తో ధన్య బాలకృష్ణ పెళ్లి జరిగిందట. ఈ విషయాన్ని స్వయంగా బాలాజీ మోహన్ వెల్లడించారు. మరో నటి కల్పిక గణేష్ గత కొన్ని రోజుల నుంచి తన పర్సనల్ లైఫ్ గురించి బహరింగంగా మాట్లాడుతుందని డైరెక్టర్ బాలాజీ మోహన్ కోర్ట్ మెట్లు ఎక్కడు.

కాగా వీరి పెళ్లి గురించి ముందుగా కల్పిక గణేష్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీని తర్వాత కల్పిక, ధన్య మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం సాగింది. తాజాగా తనకు నటి ధన్య బాలకృష్ణ కు ఏడాది క్రితమే పెళ్లి అయిందని క్లారిటీ ఇచ్చాడు బాలాజీ మోహన్. తన మొదటి భార్యకు డైవర్స్ ఇచ్చిన తర్వాతే, ధన్య బాలకృష్ణతో పెళ్లి పీటలెక్కినట్టు కోర్టుకు చెప్పారు.

- Advertisement -

తమ వ్యక్తిగత జీవితంలోని విషయాలను బహిరంగంగా చెబుతూ తమ పరువుకు భంగం కలిగించేలా నటి కల్పిక గణేష్ వ్యవహిరిస్తుందని కోర్టుకు తెలిపారు బాలాజీ మోహన్. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోర్టును బాలాజీ కోరారు. కాగా బాలాజీ మోహన్ తమిళంలో ధనుష్ తో మారి, మారి 2 తో పాటు వాయై మూడి పేసవుం వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు