Balagam: తెలంగాణా కానిస్టేబుల్ పరీక్షలో బలగం సినిమా పై ప్రశ్న

బలగం సినిమా అంతకంతకు పాపులర్ అయిపోతుంది. కమెడియన్ జబర్ధస్థ్ వేణు దర్శకుడి గా మారి తీసిన సినిమా బలగం. దిల్ రాజు ప్రొడక్షన్స్ సమర్పణలో ఆయన కూతురు హర్షిత రెడ్డి ఈ సినిమా నిర్మించారు. ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించాడు. చిన్న నటులు ఎక్కువగా నటించిన బలగం మార్చి3 న ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై అద్భుతమైన టాక్ తెచ్చుకొని సంచలన విజయం సాధించింది.

కొమరయ్య అనే వ్యక్తి చనిపోయినపుడు జరిగే 10 రోజుల దినం కార్యక్రమాలపై ఈ సినిమా కథ నడుస్తుంది. తెలంగాణా ప్రాంత జీవన విధానం గురించి ఈ సినిమాలో బాగా చూపించారు. కేవలం రెండుకోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 26 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇప్పటికే పలు నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు సాధించింది ఈ సినిమా.

తాజాగా ఈ సినిమా దర్శకుడు వేణు ట్విట్టర్ లో బలగం గురించి మరో ఆసక్తికరమైన ట్వీట్ వేశాడు. ఈ ట్వీట్ లో తెలంగాణలో ఏప్రిల్ 30న జరిగిన కానిస్టేబుల్ పరీక్షల్లో బలగం సినిమా గురించి ఒక ప్రశ్న వేశారని ఆ పేపరు ఫోటో పెట్టారు. ఆ పరిక్షా పత్రంలో బలగం సినిమా 2023 లో ఒనికో ఫిలిమ్స్ అవార్డుల్లో ఏ విభాగం లో అవార్డు గెలుచుకుంది? అని ప్రశ్న వచ్చింది. ఆ అవార్డులలో బలగం ఉత్తమ నాటక చలన చిత్ర రంగంలో అవార్డు వచ్చింది. ఈ విషయం పై దర్శకుడు వేణు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు