Nithiin : భయపెడుతున్న సెంటిమెంట్

ప్రతి ఒక్కరికి ఓ సెంటిమెంట్ ఉంటుంది. సినిమా రంగంలో మరీ ఎక్కువ. ముఖ్యంగా హీరోలకు సెంటిమెంట్లు ఉంటాయి. కొన్ని సెంటిమెంట్లు లాభాలను తెచ్చేలా ఉంటాయి. మరికొన్ని భయపెట్టిస్తాయి. ప్రస్తుతం అలాంటి భయమే యంగ్ హీరో నితిన్ కు ఉంది.

ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేకుండా, ఇబ్బందిపడుతున్న హీరోల్లో నితిన్ ఒక్కడు. “భీష్మ” కమర్షియల్ హిట్ తర్వాత వచ్చిన “చెక్” “రంగ్ దే”తో పాటు “మాస్ట్రో” ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో నితిన్ నుండి వచ్చే “మాచర్ల నియోజకవర్గం” సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను కొత్త దర్శకుడు ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా, ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతుంది.

కాగా, ఈ సినిమాను ఆగస్టు 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ ల్లో విడుదల చేయనున్నారు. ఈ రిలీజ్ డేట్ పై నితిన్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికా కారణం లేకపోలేదు. ఆగస్టులో వచ్చిన నితిన్ సినిమాలో దారుణంగా నిరాశపర్చాయి. భారీ అంచనాలతో రిలీజై బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడ్డాయి. నితిన్ కెరీర్ లో భారీ డిజాస్టార్ గా నిలిచిన “అడవి” “లై” “శ్రీనివాస కళ్యాణం” సినిమాలు ఆగస్టులోనే విడుదల అయ్యాయి.

- Advertisement -

దీంతో “మాచర్ల నియోజకవర్గం” సినిమాను ఆగస్టులో కాకుండా, వాయిదా వేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. కానీ, తన సెంటిమెంట్ ను బ్రేక్ చేయడానికి ఆగస్టులోనే ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ను నితిన్ కోరాడట. దీంతో మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగస్టులో విడుదల అవడం దాదాపు ఖాయమని తెలుస్తుంది.
మరీ ఈ సినిమాతో నితిన్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా. లేదా బలైపోతాడా అని తెలియాలంటే, ఆగస్టు 12 వరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు