Balayya : పరభాష ప్రతినాయకులే ఎందుకు ?

ఒక సినిమాకు కథనాయకుడు ఎంతో ముఖ్యమో.. ప్రతి నాయకుడు కూడా అంతే ముఖ్యం. ఒక వంతుగా చెప్పాలంటే.. హీరో కంటే విలన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. విలన్ ఎంత బలవంతుడు అయితే హీరోకు అంత ఎలివేషన్ సీన్స్ పడుతాయి. సినిమా హిట్ అవుతుంది. ప్రతి నాయకుడి ఎంపిక విషయంలో తెలుగు ఇండస్ట్రీలో ఒక్కొ డైరెక్టర్ ఒక్కో స్టైల్ ను ఫాలో అవుతాడు. పైన చెప్పినట్టు హీరో కంటే విలన్ బలవంతుడి గా ఉండేలా దర్శకధీరుడు రాజమౌళి చూసుకుంటాడు. ఈ ఫార్ములాతోనే బాహుబలిలో ప్రభాస్ ను ఢీ కొట్టేందుకు రానాను తీసుకున్నాడు.

అయితే మరి కొందరు డైరెక్టర్లు విలన్లను స్టైలీష్ గా చూపిస్తున్నారు. ప్రతి నాయకుడు అంటే కత్తులు పట్టుకుని, దట్టమైన మీసాలు పెట్టుకుని భయంకరంగా ఉండాలి అనే దాన్ని పక్కన పెట్టి సూటు, బూటు వేసి హీరో కంటే స్టైలీష్ గా చూపిస్తున్నారు. మరికొంత మంది అయితే తెలుగులో ఉన్న నటులను పక్కనబెట్టి ఇతర భాషల్లో క్రేజ్ ఉన్న వారిని విలన్ గా ఎంపిక చేస్తున్నారు. అలా బాలయ్య సినిమాలో ఇప్పుడు పరభాష ప్రతినాయకులే కనిపిస్తున్నారు.

అఖండ తర్వాత బాలయ్య చేస్తున్న రెండు సినిమాల్లో పరభాష ప్రతినాయకులే దర్శనమిస్తున్నారు. ఇప్పటికే వీర సింహా రెడ్డిలో దునియా విజయ్ అనే కన్నడ నటుడు విలన్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలోని దునియా విజయ్ ఫస్ట్ లుక్ ను గోపిచంద్ మలినేని విడుదల చేశారు. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరగబోతుందని తెలుస్తుంది.

- Advertisement -

అయితే ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా అర్జున్ రాంపాల్ ను ఎంపిక చేసినట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. దీంతో బాలయ్య నుంచి వస్తున్న వరుస రెండు సినిమాల్లో ప్రతినాయకులు పరభాషకు చెందిన వారే. దీంతో బాలయ్యకు విలన్ లను ఇతర భాషల నుంచే ఎందుకు తీసుకుంటున్నారు ? బాలయ్యను ఢీ కొట్టే వాడు తెలుగులో లేడా అని సినీ అభిమానులు చర్చిస్తున్నారు. అయితే ప్రతి నాయకులను పరభాష నుంచి తీసుకువస్తే.. ఆ భాషలో కూడా సినిమాపై బజ్ క్రియేట్ అవుతుందని అంటున్నారు కొంతమంది. ఏది ఏమైనా బాలయ్య నుంచి రాబోయే రెండు సినిమాల్లోనూ పరభాష ప్రతినాయకులు దర్శనం ఇవ్వబోతున్నారు. ఇది బాలయ్య సినిమాలపై ఇంత వరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు