Anjali: షాకింగ్ కామెంట్స్!

తెలుగు సినీ పరిశ్రమలో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరు పొందిన వారిలో హీరోయిన్ అంజలి కూడా ఒకరు. వెంకటేష్, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సరసన నటించింది అంజలి. శ్రీకాంత్ అడ్డాలో దర్శకత్వంలో 2013లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకేక్కిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో నటించి సౌందర్య లేని లోటును తీర్చింది. ఇక తాజాగా అంజలి లీడ్ రోల్ చేసిన “ఫాల్” అనే వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న అంజలి ఇటీవల తనపై వచ్చిన రూమర్స్ గురించి స్పందించింది.

అమెరికాలో ఉంటున్న ఓ ఇండియన్ ని ఆమె వివాహం చేసుకున్నదనే వార్తల్లో నిజం లేదని అంజలి స్పష్టం చేసింది. ” గతంలో నేను ఓ టాక్సిస్ రిలేషన్ షిప్ లో ఉన్నాను. అప్పుడు ఆ రిలేషన్ పై నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. కానీ అది నేను అనుకున్నంత అందంగా లేదని తెలిసి దానికి ఎండ్ కార్డు వేశాను” అని చెప్పింది అంజలి. ఇక జర్నీ మూవీలో అంజలితో జత కట్టిన హీరో జై తో ఆమె రిలేషన్ నడిపారని అప్పట్లో కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. జై తో రిలేషన్ పై కూడా అంజలి స్పందించింది. “నాకు పరిశ్రమలో చాలామంది మిత్రులు ఉన్నారు. వారిలో జై కూడా ఒకరు. అంతకుమించి మా మధ్య ఏమీ లేదు” అని స్పష్టం చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు