Amani: ప్రైవేట్ పార్ట్స్ పై అసభ్యంగా… క్యాస్టింగ్ కౌచ్ పై స్పందన..!

Amani.. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీటూ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి చాలామంది హీరోయిన్లు తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్లు కూడా ఇప్పుడు.. గతంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా చెప్పుకొస్తున్నారు.. అందులో భాగంగానే ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఆమని కూడా తనపై జరిగిన వేధింపులను సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది..

Amani: Amani says bold comments about casting couch..!
Amani: Amani says bold comments about casting couch..!

గ్లామర్ ప్రపంచాన్నే ఉర్రూతలూగించింది..

ఒక తరంలో తన నటనతో ప్రేక్షకులను ఆకర్షించిన ఈమె ముఖ్యంగా..ఈమె నటన కోసం సినిమాకు వెళ్లే జనం కూడా ఉండేవారు అనటంలో అతిశయోక్తి కాదు… నటనా ప్రధానమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ స్టార్ స్టేటస్ ను అందుకుంది. తోటి హీరోయిన్స్ తో గ్లామర్ ప్రపంచంలో గట్టి పోటీ ఇచ్చి కుర్ర కారును ఉర్రూతలూగించింది.. నటననే నమ్ముకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈమె తెరపై సాంప్రదాయ పాత్రలు చేస్తూ అచ్చ తెలుగుతనానికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించింది..

క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డ ఆమని..

వెండితెరపై సాంప్రదాయంగా కనిపించిన ఆమని కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొంది అంటే ఎవరైనా నమ్మగలమా.. ఆ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది..ఆమెని మాట్లాడుతూ.. నా కెరియర్ తొలినాళ్లలో చాలామంది నిర్మాతలు, దర్శకుల మాటలు నన్ను ఇబ్బంది పెట్టాయి. ఒక తమిళ దర్శకుడు ఏకంగా నన్ను స్ట్రెచ్ మార్క్స్ మీకు ఉన్నాయో లేదో చూపించండి అంటూ బహిరంగంగా అడిగాడు… దీంతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను.. ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ అలాగే బాడీలో ఎవరికి చెప్పుకోలేని చోట్ల కూడా వారికి చూపించాలంటూ ఇబ్బంది పెట్టిన దర్శకులు కూడా ఉన్నారు. ఇక అలాంటి రోజులు మళ్లీ రాకూడదని కోరుకున్నాను అంటూ సీనియర్ హీరోయిన్ చెప్పుకొచ్చింది..

- Advertisement -

ఇతరులకు లొంగకపోవడమే జీవితం..

ఇకపోతే పెద్దపెద్ద సినిమాలలో చేసేటప్పుడు నటీనటులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. అలాంటి ఇబ్బందులు కేవలం చిన్న చిన్న సినిమాల్లో మాత్రమే ఎదురవుతాయని చెప్పుకొచ్చింది .. జీవితంలో ఒక్కసారి లొంగితే అది ఒకరితో ఆగదు… నా జీవితంలో అలాంటి రోజు అసలు రానందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను అంటూ ఆమని చెప్పుకొచ్చింది..

ఆమని సినిమా జీవితం..

నటనా అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఆమని తెలుగునాట అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, సుమన్ , నరేష్, జగపతిబాబు వంటి ప్రముఖ హీరోల సరసన నటించింది. నటి సౌందర్యతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె జంబలకడిపంబ, శుభలగ్నం, ఆ నలుగురు, శుభసంకల్పం, పచ్చని సంసారం, మావిచిగురు, ప్రియమైన శ్రీవారు వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది.. తెలుగు మాత్రమే కాదు తమిళ్ , కన్నడ సినిమాలలో కూడా హీరోయిన్గా మెప్పించిన ఈమె ప్రస్తుతం రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయింది ..అంతేకాదు అప్పుడప్పుడు జబర్దస్త్ వంటి బుల్లితెర షోలలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఆమని.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు