Tollywood : ఒక్క సరైన సినిమా లేదు. మంచి వారం మిస్ చేసుకున్న వాళ్లు వీళ్లే!

Tollywood : టాలీవుడ్ లో ఈ ఇయర్ సమ్మర్ బోసి పోతుంది. సమ్మర్ ఆరంభంలోనే ఫ్యామిలీ స్టార్ వంటి డిజాస్టర్ తో నీరు గార్చేసిన టాలీవుడ్ మేకర్స్ ఆ తర్వాత కూడా ఇప్పటివరకు ఒక్క సరైన సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తేలేకపోతున్నారు. ఒక పక్క ఇతర భాషల్లో నెలకో రెండు మూడు బ్లాక్ బస్టర్ సినిమాలతో రచ్చ చేస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం నాసిరకం సినిమాలు తీస్తూ తెలుగు ఆడియన్స్ కి విసుగు తెప్పిస్తున్నారు. కనీసం చిన్న సినిమాలైనా ఏమైనా ఆకట్టుకుంటాయా అంటే అవి మరింత దారుణంగా తయారయ్యాయి. ఇక ఈ వారం నాలుగు సినిమాలు రిలీజ్ కావడం జరిగింది. అన్ని చిన్న సినిమాలే కాగా, అందులో ఒక్క సినిమా కూడా ప్రేక్షకులని ఆకట్టుకునేలా లేదు.

అన్ని సినిమాలకు నెగిటివ్ టాక్..

టాలీవుడ్ (Tollywood) లో ఈ వారం నాలుగు సినిమాలు రిలీజ్ కావడం జరిగింది. మార్కెట్ మహాలక్ష్మి, తెప్ప సముద్రం, టెనెంట్, పారిజాత పర్వం అని నాలుగు డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కిన సినిమాలు రిలీజ్ కాగా నాలుగింటికి ప్లాప్ టాక్ వచ్చింది. మార్కెట్ లో మహాలక్ష్మి లవ్ కామెడీ డ్రామాగా తెరకెక్కగా, తెప్ప సముద్రం మాస్ కమర్షియల్ డ్రామాగా తెరకెకెక్కింది. ఇక టెనెంట్ సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కగా, పారిజాత పర్వం సస్పెన్స్ కిడ్నాప్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. ఇక ఈ అన్ని సినిమాల్లో కూడా పారిజాత పర్వానికి జనాల్లో కాస్త మంచి అంచనాలు ఉండగా, రిలీజ్ అయ్యాక ఆ సినిమా కూడా బోరింగ్ స్క్రీన్ ప్లే తో సిల్లీ డ్రామా అన్న టాక్ తెచ్చుకుంది. ఇక మిగతా సినిమాలు అసలు రిలీజ్ అయ్యాయన్న సంగతి కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలీదు. ఇక ఈ వారం డబ్బింగ్ సినిమాలేమి రిలీజ్ కాలేదు. మూడు వారాల కింద వచ్చిన టిల్లు స్క్వేర్ తర్వాత సరైన సినిమా ఇప్పటివరకు ఏది రాకపోవడంతో, నాలుగో వారం కూడా టిల్లుగానికి అడ్వాంటేజ్ గా మారింది.

మంచి సీజన్ ని మిస్ అయిన సినిమాలు..

అయితే టాలీవుడ్ లో హిట్టు సినిమా వచ్చి మూడు వారాలయింది. తెలుగు మూవీ లవర్స్ ఆకలిమీదున్నారు. కానీ ఈ అవకాశాన్ని ఒక్క సినిమా కూడా క్యాష్ చేసుకోలేదు. నిజానికి ఏప్రిల్ నెలలో బడా సినిమాలు కూడా రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ డిలే వల్ల వాయిదా పడ్డాయి. కనీసం మీడియం రేంజ్ హీరోలైన క్యాష్ చేసుకోలేదు. అన్నీ బాగుంటే ఆకలిమీదున్న టాలీవుడ్ ఆడియన్స్ కి ఏప్రిల్ లో దేవర సినిమాతో మంచి పుల్ మీల్స్ వచ్చేది. కానీ కుదరలేదు. ఇక ఇదే నెలలో గ్యాంగ్స్ అఫ్ గోదావరి కూడా రిలీజ్ కావాల్సింది కానీ మే కి షిఫ్ట్ అయింది. అప్పుడు ఎన్నికల హడావిడిలో సినిమాను చూస్తారా లేదా అనేది కూడా తెలీదు. ఇక అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు ఎప్రిల్ రెండో వారంలో రిలీజ్ కావల్సింది. కానీ పోటీ వద్దనుకుని మే 3కి షిఫ్ట్ చేసారు. ఈ వారం వచ్చి ఉంటే సమ్మర్ హీట్ లో కామెడీ డ్రామాతో మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేదేమో. ఇక దిల్ రాజు లవ్ మీ ని కూడా ఎప్రిల్ నుండి మే కి షిఫ్ట్ చేసాడు. ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ వల్ల, ఆ సినిమాని పక్కా ప్లానింగ్ తో రిలీజ్ చేయాలనీ, ప్రమోషన్ల కోసం వాయిదా వేసారు. ఫైనల్ గా ఈ ఇయర్ మొదలవ్వక ముందు ఎప్రిల్ లో గేమ్ ఛేంజర్ వస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఇండియన్ 2 వల్ల గేమ్ ఛేంజర్ ని ఏకంగా అక్టోబర్ కి షిఫ్ట్ చేశారు. ఏది ఏమైనా ఎప్రిల్ సమ్మర్ హాలిడేస్ ని టాలీవుడ్ సినిమాలు అనవసరంగా మిస్ చేసారని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు