Vishwambhara : కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న త్రిష..! సౌత్ లోనే టాప్?

Vishwambhara : సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు దశాబ్దాలుగా సౌత్ లో దూసుకుపోతున్న ఈ హీరోయిన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కెరీర్ మొదట్లోనే సౌత్ స్టార్స్ అందరితోనూ జత కట్టిన ఈ భామ, కొన్నేళ్లు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. కానీ అనూహ్యంగా లాస్ట్ ఇయర్ పొన్నియిన్ సెల్వన్, లియో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఓ రేంజ్ లో ఫామ్ లోకి వచ్చేసింది. మూడు నాలుగేళ్ల కిందటివరకు చిన్న చిన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ గడిపిన త్రిష ఇప్పుడు ఏకంగా బడా సినిమాలు మాత్రమే చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది. అన్నిటికి మించి ఇప్పుడు సౌత్ లో సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్ గా త్రిష ఫస్ట్ ఆప్షన్ గా మారింది. ఇక త్రిష ప్రస్తుతం సౌత్ లోనే నాలుగు బడా ప్రాజెక్టుల్లో నటిస్తుంది. పైగా అన్ని సినిమాలు సీనియర్ స్టార్ హీరోల సినిమాలే కావడం విశేషం.

ఎనిమిదేళ్ల తర్వాత తెలుగులో..

ఇక త్రిష కృష్ణన్ నటిస్తున్న క్రేజీ చిత్రాల్లో “విశ్వంభర” కూడా ఒకటి. తమిళ్ కంటే ముందుగా తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన త్రిష తెలుగులో ఓ రేంజ్ సినిమాలు చేసింది. ఆ తర్వాత కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో తెలుగులో ఆఫర్లు తగ్గాయి. చివరగా నాయకి అనే ద్విభాషా చిత్రంలో నటించగా ఆ సినిమా కూడా ఆడలేదు. ఇక ఆ సినిమా వచ్చిన ఎనిమిదేళ్ళకి త్రిష మళ్ళీ తెలుగు లో నటిస్తుంది. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటైన “విశ్వంభర” మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తునాడన్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా 200 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని వార్తలు రాగా, మెయిన్ హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. నెలన్నర కిందటే త్రిష ఫైనలైజ్ కాగా, ఇప్పటికే వరుస షెడ్యూల్స్ లో త్రిష కూడా పాల్గొంటుంది.

విశ్వంభరతో హైయెస్ట్ రెమ్యూనరేషన్?

ఇక త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విశ్వంభర (Vishwambhara) చిత్రానికి త్రిష కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. విశ్వంభర సినిమాకు త్రిష ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇంతకు ముందు నయనతార తాను నటించిన ఓ సినిమాకు అత్యధికంగా 8 కోట్ల రూపాయలు పారితోషకం తీసుకుందని వార్తలు వచ్చాయి. కానీ త్రిష ఇప్పుడు అందర్నీ బీట్ చేసి ఏకంగా పది కోట్ల కి పైగా భారీ రెమ్యూనరేషన్ తో సౌత్ లోనే హై రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా నిలిచిందని సమాచారం. ఈ వార్తలపై ఎంత నిజమో తెలీదు గాని, త్రిష ఇప్పుడున్న సీనియర్ స్టార్స్ కి బెస్ట్ ఆప్షన్ గా మారినందువల్ల మంచి రెమ్యూనరేషన్ దక్కుతుందని చెప్పొచ్చు. చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి స్టార్స్ సరసన ఇప్పుడు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. ఇక విశ్వంభర సినిమా హిట్ అయితే తెలుగులో కూడా బడా సినిమాలతో త్రిష బిజీ అవడం ఖాయమని చెప్పొచ్చు. ఇక విశ్వంభర మూవీ పంచ భూతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఫాంటసీ సినిమా కాగా, ఇందులో త్రిష రెండు పాత్రల్లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇక త్రిష కూడా ఈ సినిమా కోసం గత నెలరోజులుగా హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటుంది. ఇక త్రిష ప్రస్తుతం విశ్వంభర తో పాటు, విదా మయుర్చి, రామ్, తగ్ లైఫ్ సినిమాల్లో నటిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు