Hari Hara Veera Mallu : ట్విస్ట్‌లన్నీ ఆ పాత్రలతోనే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఇంతలా ఎదురుచూసేందుకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. ఇలాంటి పీరియాడికల్ నేపథ్యం సాగే పాత్రను పవన్ ఇప్పటి వరకు చేయలేదు. అలాగే ఈ సినిమా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రాబోతుంది. అంటే ఇది పవన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో వస్తున్న మూవీ. వీటితో పాటు సినిమా నుంచి వచ్చిన పోస్టర్, టీజర్ లలో పవన్ లుక్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసింది. దీంతో ఈ సినిమా ఆలస్యమైనా, అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

కాగా ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. పవన్ బిజీ షెడ్యూల్ వల్ల ఆలస్యమైన ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి వేసవి కానుకగా విడుదల చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో పంచమి అనే పాత్రలో నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే పలువురు సీనియర్ నటీనటులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన సోషల్ మీడియా, టాలీవుడ్ వర్గాల్లో తెగ వైరల్ అవుతుంది. సినిమాలో పవన్ పాత్రతో పాటు మరో రెండు పాత్రలు కూడా హైలైట్ గా ఉంటాయట. అవే ఔరంగజేబు, రోషనారా పాత్రలు. ఔరంగజేబు ఒక మొఘల్ చక్రవర్తి. రోషనారా అంటే ఔరంగజేబు సోదరి. ఈ రెండు పాత్రలను డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గొప్పగా చూపించడట. ఈ పాత్రలతోనే సినిమాలో అనేక ట్విస్ట్ లు కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

- Advertisement -

కాగా ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబి డియోల్, రోషనారా పాత్రలో నర్గీస్ ఫక్రీ నటిస్తున్న విషయం తెలిసిందే. అంటే సినిమా బాబి డియోల్, నర్గీస్ ఫక్రీ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని అర్థమవుతుంది. మరి వీరి పాత్రలను డైరెక్టర్ ఎలా డిజైన్ చేశాడు ? ఎలాంటి ట్విస్ట్ లు ఉండబోతున్నాయి ? అని తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు