Alia Bhatt : ఆస్కార్ బరిలో..

సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమం త్వరలోనే రానుంది. పలు విభాగాలకు సినిమాలను ఎంపిక చేసే పనిలో నిర్వాహకులు ఉన్నారు. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా మూడు విభాగాల్లో ఆస్కార్ నామినేట్ కు పంపించారు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. తాజాగా భారతదేశం నుండి మరో సినిమా ఆస్కార్ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఇటీవల నటించిన చిత్రం గంగూబాయి కతియావాడి. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ ముందు మంచి కలెక్షన్లను రాబట్టింది. ఆలియా భట్ కెరీర్ లో ఒక పెద్ద హిట్ గా ఈ చిత్రం నిలిచింది. ఆలియా నటన్ కు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. గంగూబాయి కతియావాడి చిత్రానికి ఆస్కార్ నామినేషన్ లభించే సూచనలు ఉన్నట్లు బాలీవుడ్ మీడియా చెబుతుంది.

ఈ చిత్రం నేచురల్ గా ఉండటం, వాస్తవ అంశాలను చూపించడం వల్ల ఆస్కార్ నామినేషన్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఒక వేళ గంగూబాయి కతియావాడి చిత్రానికి ఆస్కార్ నామినేషన్ లభిస్తే.. ప్రస్తుతం నామినేట్ అయిన సినిమాలకు గట్టి పోటీ ఇస్తుందని బాలీవుడ్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు