అక్షయ్ కుమార్ బాలీవుడ్ టాప్ హీరో. గత 30 ఏళ్ల నుంచి అక్షయ్ కుమార్ వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఈయన వందకు పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎన్నో అవార్డులను గెలుచుకున్నాడు. వీటిలో నేషనల్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. అక్షయ్ కుమార్ నుంచి ఏదైనా చిత్రం వస్తుందంటే పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఉంటాయి. ఇందులో పీరియాడికల్ చిత్రాలు చేస్తే మరింత స్థాయిలో అంచనాలు ఉంటాయి.
అక్షయ్ కుమార్ ఈ ఏడాది సామ్రాట్ ప్రుథ్వి రాజ్ చౌహాన్ బయోపిక్ చేశాడు. భారీ అంచనాలతో ఈ ఏడాది జూన్ 3వ తేదీన విడుదలైంది. కానీ ఈ చిత్రం దారుణమైన అపజయాన్ని మూటగట్టుకుంది.రూ. 220 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం, కేవలం రూ. 95 కోట్లను మాత్రమే వసూళ్లు చేసింది. ఇది ఇలా ఉండగా అక్షయ్ కుమార్ మరో పీరియాడికల్ బయోపిక్ ను చేయడానికి రెడీ అవుతున్నారు.
Read More: Ponniyin Selvan : ఫస్ట్ సింగిల్ అప్ డేట్
ఒకప్పటి మహా రాష్ట్ర రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర పై ఈ చిత్రాన్ని చేయబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా చేశారు. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఈ పీరియాడికల్ చిత్రం రాబోతుంది. ఈ భారీ ప్రాజెక్ట్ కు “వీర్ దౌదలే సాత్ ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. వచ్చే ఏడాది దీపావళికి పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యే విధంగా మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.
Read More: Love Today: వన్ ఇయర్ బ్యాక్ ఒకడు వచ్చాడు , కోట్లు కొల్లగొట్టాడు
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...