Adivi Sesh: హిట్ 2 రిలీజ్ కాకుండానే హిట్ 3

టాలీవుడ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాగా తెర‌కెక్కిన హిట్ ది ఫ‌స్ట్ కేస్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతటి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే.
ఈ సినిమాకి కొన‌సాగింపుగా హిట్ 2 చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నట్లు చిత్రయూనిట్ గ‌తంలోనే ప్ర‌క‌టించింది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ తో పాటు ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు మూవీ మేక‌ర్స్‌. తాజాగా టీజ‌ర్ విడుద‌ల తేదీని ఖ‌రారు చేశారు.

హిట్ సినిమాను ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను తెర‌కెక్కించ‌గా.. వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్ పై నేచుర‌ల్ స్టార్ నాని నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ ప‌ర్ఫార్మెన్స్ అదిరిపోయింద‌నే చెప్పాలి. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు చాలా క‌నెక్ట్ అయింది.  ఇప్పుడు  హిట్ 2  సినిమాపై కేవ‌లం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తోనే  ఆస‌క్తిని పెంచుతూ వ‌చ్చిన చిత్ర బృందం తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌కి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ని ఇచ్చారు. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు శైలేష్ వైవిద్యంగా హిట్ వెర్స్ అనే ప్ర‌పంచాన్ని ప్రేక్ష‌కుల‌కు వివ‌రిస్తూ.. హిట్ 1, హిట్ 2 చిత్రాల గురించి చెబుతూ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించాడు. హిట్ 3 గురించి చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. హీరో అడివి శేష్ వ‌చ్చి హిట్ 2 రిలీజ్ కాకుండానే హిట్ 3 గురించి అప్పుడే చెప్పేస్తావా అంటూ ప్ర‌శ్నిస్తాడు.

హిట్ 2 టీజ‌ర్ డేట్ ఎప్పుడో చెప్పేయ‌మ‌ని హీరో అడ‌గ్గా.. న‌వంబ‌ర్ 3న హిట్ 2 టీజ‌ర్‌ని విడుద‌ల చేస్తున్న‌ట్టు డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను ప్ర‌క‌టించాడు. మొత్తానికి ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న హిట్ 2 టీజ‌ర్ విడుద‌ల తేదీనీ ఎట్ట‌కేల‌కు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌డంతో ప్రేక్ష‌కులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక డిసెంబ‌ర్ 2న హిట్ 2 చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తోంది చిత్ర యూనిట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు