UBS: సినిమాలలో హీరోయిన్ గా రావడానికి శ్రీలీల అలాంటి పనులు చేసిందా..?

శ్రీలీల.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో యంగ్ బ్యూటీ శ్రీలీల ఒకరు. టాలీవుడ్ లో ప్రేక్షకులు, దర్శక నిర్మాతలు, హీరోలు ప్రస్తుతం శ్రీలీల నామ జపం చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ నటిస్తే సినిమా హిట్ అనే ఒక కొత్త తరహా సెంటిమెంట్లను తెరపైకి తెస్తున్నారు.

పెళ్లి సందD సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో బిజీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, రామ్ – బోయపాటి మూవీ, బాలకృష్ణతో భగవంత్ కేసరి, నితిన్ 32, గాలి జనార్దన్ రెడ్డి కొడుకు హీరోగా పరిచయమవుతున్న జూనియర్ అనే కన్నడ సినిమా, సాయి ధరమ్ తేజ్, సంపత్ నందిల సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.

శ్రీలీల తనకు డేట్స్ ఖాళీ లేవు అని చెప్పడానికి కూడా ఖాళీ లేనంత బిజీగా మారింది. అయితే సినిమాలలోకి రావడానికి శ్రీలీలకు చిన్నతనం నుండే చాలా కష్టపడిందట. ఉదయాన్నే స్కూల్ కి వెళ్లి, సాయంత్రం ట్యూషన్.. నైట్ సమయంలో యాక్టింగ్ స్కూల్ లో యాక్టింగ్ నేర్చుకుందట. ఓవైపు చదువు – మరోవైపు యాక్టింగ్ క్లాసెస్ కి ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ చిన్నతనంలో ఎంజాయ్ చేయాల్సిన ఆటలన్నీ ఆడకుండానే వచ్చేసిందట. ఈ విషయాలని ధమాకా సినిమా ప్రమోషన్స్ లో ఈ ముద్దుగుమ్మ స్వయంగా చెప్పుకొచ్చింది. దీంతో శ్రీలీల ఇంతగా కష్టపడిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు