Sri Simha: “భాగ్ సాలే” ట్రైలర్.. ఈ సారి అన్ లిమిటెడ్

శ్రీ సింహ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. టాలీవుడ్ లో విభిన్న సినిమాలు చేసే హీరోల్లో శ్రీ సింహ కూడా ఒకడు. కీరవాణి కొడుకైనప్పటికీ మ్యూజిక్ ఫీల్డ్ లో కాకుండా యాక్టింగ్ ఫీల్డ్ లోఅడుగుపెట్టాడు. అయినా అందరి లాగా కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా మంచి సినిమాలు తీస్తూ గుర్తింపు తెచ్చుకున్న్నాడు. రీసెంట్ గా “ఉస్తాద్” అనే సినిమాలో నటించిన శ్రీ సింహ ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా కూడా ఫినిష్ చేసాడు. ఆ సినిమా పేరు “భాగ్ సాలే”. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.

ట్రైలర్ చూస్తుంటే మరి కొత్త కాన్సెప్ట్ తో సినిమా చేయకపోయినా, కొత్త రకం టేకింగ్ తో తీశారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో శ్రీ సింహ ఒక చెఫ్ గా నటించాడు. సినిమా మొత్తం ఒక ఉంగరం పై నడుస్తుందని డైరెక్టర్ ట్రైలర్ లోనే చెప్పేసాడు. ఆ ఉంగరం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో సినిమా లోని ఇతర పాత్రధారులు ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నంలో జరిగే నాటకీయ పరిణామాల్లో జరిగే కామెడీయే ఈ సినిమాకి ప్రధాన బలం. ట్రైలర్ మొత్తం ఫుల్ కామెడీ డైలాగ్ లతో ఫన్ జెనరేట్ చేసిన దర్శకుడు సినిమాలో కూడా అదే కామెడీ తో మెప్పిస్తాడా అనేది చూడాలి.

- Advertisement -

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నేహా సోలంకి నటించగా, రాజీవ్ కనకాల, హర్ష చెముడు, జాన్ విజయ్, వర్షిణి, నందిని రాయ్, తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకి కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ప్రణీత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా, వేదనీష్ క్రియాటివ్ వర్క్స్ బ్యానర్ లో అర్జున్ దాస్యన్, యాష్ రాగినేని, కళ్యాణ్ నిర్మించారు. కాగా జులై 7న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు