Lust Stories 2: పదో తరగతిలోనే అతనితో కమిట్ అయ్యాను – మృణాల్ కామెంట్స్ వైరల్

సీతారామం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈ సినిమాలో సీత అలియాస్ నూర్జహాన్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. అయితే ఇటీవలనే బాలీవుడ్ లో బిజీ అయిన ఈ భామ.. సీతారామం సినిమాలో ఎంత పద్ధతిగా కనిపించిందో లస్ట్ స్టోరీస్ 2 లో అంత బోల్డ్ గా కనిపించి ఫ్యాన్స్ కి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

ఈమెను సీతగా చూసిన తెలుగు ప్రేక్షకులు పోట్టిబట్టలలో చూడలేకపోయారని చెప్పాలి. అయితే తాజాగా లాస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఇంటర్వ్యూలో తన లవ్ అండ్ బ్రేకప్స్ గురించి చెప్పుకొచ్చింది. ఈమెకు పదవ తరగతిలోనే ఫస్ట్ లవ్ ప్రపోజల్ వచ్చిందట. అతను చాలా అందంగా ఉండేవాడని చెప్పింది మృణాల్. అయితే ఆ వయసులో తనకి మెచ్యూరిటీ లేకపోవడం వల్ల కమిట్ అయ్యానని చావు కబురు చల్లగా చెప్పింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

అయితే ఆ తరువాత కొద్ది రోజులు అతనితో బాగానే ఉన్నప్పటికీ.. పదో తరగతి తరువాత పై చదువుల కోసం ముంబై వెళ్లినందువల్ల అతనితో రిలేషన్ కట్ అయిందని తెలిపింది. ఇదే కాకుండా ఇండస్ట్రీలోకి రాకముందు మరో వ్యక్తితో ప్రేమలో పడ్డానని తెలిపింది. ఆ తరువాత అతనికి కూడా బ్రేకప్ చెప్పేసిందట. ఇక ప్రస్తుతం సింగిల్ స్టేటస్ మెయింటైన్ చేస్తున్నానని తెలిపింది మృణాల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు