Adipurush: ఓం రౌత్ మరోసారి రూమ్ లోకి వెళ్లుంటే బాగుండేదేమో..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా తారాస్థాయిలో ఏర్పడ్డ అంచనాలను అందుకోలేక ఫస్ట్ షోతోనే మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. రామాయణాన్ని ఆధునిక టెక్నాలజీ వాడి ఈ తరానికి అడాప్ట్ అయ్యేలా రూపొందించే క్రమంలో సినిమా యూనిట్ చాలా టాపాటాడడుగులు వేసింది. రావణాసురుడి గెటప్ లో పెను మార్పులు, కీలక ఘట్టాలను యధావిధిగా కాకుండా మార్పులు చేశారు. ఆ మార్పులు మెప్పించకపోగా ప్రేక్షకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించే విధంగా ఉన్నాయి. ప్రభాస్ లుక్స్ విషయంలో కూడా చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్పెషల్ గా, బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి రామాయణం ఆధారంగా వచ్చిన చాలా సినిమాల్లో రాముడిని నీలమేఘ శ్యాముడిగా చుసిన తెలుగు ప్రేక్షకులు మోషన్ క్యాప్చర్ విధానంలో ప్రభాస్ ని రాముడి గెటప్ లో యాక్సెప్ట్ చేయలేకపోయారని చెప్పాలి.

ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సిన ఎమోషన్, సెంటిమెంట్ ఉన్న రామాయణాన్ని కథా వస్తువుగా తీసుకున్న ఓం రౌత్, ప్రేక్షకుడ్ని చివరి వరకు ఎంగేజ్ చేయటంలో పూర్తిగా విఫలం అయ్యాడని చెప్పాలి. యూనివర్సల్ రీచ్ ఉన్న ఈ కథని మోషన్ క్యాప్చర్ లో తీయటం అన్నది పెద్ద మైనస్ పాయింట్. ప్రభాస్ మొదలుకొని మిగతా ప్రధాన పాత్రల హావభావాలు కృత్రిమంగా ఉండటానికి కారణం మోషన్ క్యాప్చర్ విధానమే అన్నది వాస్తవం. ప్రథమార్ధంలో కథని కొంతవరకు ఎంగేజింగ్ గా చూపించినప్పటికీ ద్వితీయార్థంలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు ఓం రౌత్. రామరావణ యుద్దాన్ని కాస్తా మానవుడికి, ఏలియన్స్ కి మధ్య పోరాటంలా మార్చేశాడు.

రామాయణం లాంటి ఎపిక్ ని ఆదిపురుష్ రూపంలో కొత్త తరహాలో చూపించాలన్న ఓం అండ్ కో ప్రయత్నం వికటించి నవ్వుల పాలయ్యేలా చేసింది. భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా సినిమా తీయాలన్న ఆరాటంలో తాను డీల్ చేస్తున్నది కొన్ని యుగాల పాటు భారత జాతికి స్ఫూర్తిదాయకంగా ఉన్న రామాయణ ఇతిహాసాన్ని అనే స్పృహ కోల్పోయానట్లు అనిపిస్తుంది. మొత్తానికి సిల్వర్ స్క్రీన్ పై కళాఖండంగా ఉండాల్సిన కథని తన పైత్యంతో అధోగతి పాలు చేశాడు ఓం రౌత్. దీంతో టీజర్ సమయంలో పూర్ క్వాలిటీ విజువల్స్ తో విమర్శలు వచ్చిన సమయంలో వైరల్ అయిన ‘ఓం కమ్ టు మై రూమ్’ అన్న ప్రభాస్ డైలాగ్ ని మరోసారి వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. మరి, వెయ్యి కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా ఏ మేరకు రీచ్ అవుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు