Aadikeshava: మరొక ఆచార్య అవుతుందా..?

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరో, హీరోయిన్లుగా నూతన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో నాగవంశీ నిర్మిస్తున్న సినిమా ‘ఆదికేశవ’. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ గ్లిమ్ప్స్ తాజాగా విడుదలైంది, శివాలయం మీద కన్నేసిన మైనింగ్ మాఫియాకి హీరోకి మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్ ప్రధానంగా రూపొందిన గ్లిమ్ప్స్ చూస్తుంటే ఆచార్య సినిమా ఛాయలు కనిపిస్తున్నాయని కాంనట్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. సినిమా టైటిల్ కూడా అంత ట్రెండీగా లేదని టాక్ వినిపిస్తోంది. జీవి ప్రకాష్ సంగీతం అందించిన ఈ సినిమాను జులైలో విడుదల అవనున్నట్టు అనౌన్స్ చేసింది సినిమా యూనిట్.

గుడి చుట్టూ తిరిగే యాక్షన్ డ్రామాగా అనిపిస్తున్న ఈ సినిమా కథలో కొత్తదనం ఉన్నట్టు అనిపించటం లేదు. కెరీర్లో మొదటిసారి యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాలో నటిస్తున్న వైష్ణవ్ తేజ్, రుద్రకాళేశ్వర్ రెడ్డిగా రఫ్ లుక్స్ తో ప్రామిసింగ్ గా అనిపిస్తున్నాడు. అయితే, ఇదే ఇంచు మించు ఇదే నేపథ్యంలో వచ్చిన మెగాస్టార్ ఆచార్య మిగిల్చిన చేదు అనుభవాన్ని మరువక ముందే మళ్లీ అదే బ్యాక్డ్రాప్ లో ఆదికేశవ సినిమా వస్తుండటం మెగా అభిమానులను కలవరపెడుతోంది.

అయితే, ఆచార్య సినిమాలో లోపించిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, పస లేని క్యారెక్టరైజేషన్ వంటి పొరపాట్లు గనక ఆదికేశవ సినిమా విషయంలో రిపీట్ అవ్వకపోతే మాత్రం సినిమా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేని వైష్ణవ్ తేజ్ కి ఈ సినిమా కీలకం కానుంది. వరుస హిట్స్ తో క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాకు పాజిటివ్ అంశంగా కనిపిస్తోంది. హీరో వైష్ణవ్ తేజ్ తో సహా మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు