Megha Akash: పొలిటీషియన్స్ ని పెళ్లాడిన హీరోయిన్లు ఎవరంటే..?

సెలబ్రటీల లైఫ్ లో ఏం జరిగినా కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు క్యాజువల్ గా ఫోటో దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినా కూడా వైరల్ అవుతూ ఉంటుంది. అలాంటిది హీరోయిన్స్ ఎంగేజ్మెంట్, పెళ్లి వంటి విషయాలు అనౌన్స్ కాకముందే సోషల్ మీడియాలో రూమర్లు హల్చల్ చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం హీరోయిన్ మేఘ ఆకాష్ పెళ్లి విషయంపై ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమిళనాడుకి చెందిన ప్రముఖ పొలిటీషియన్ కొడుకుతో మేఘ ప్రేమాయణం నడుపుతోందని, త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుందని ఆ వార్త సారాంశం. ఈ రూమర్స్ పై మేఘ నుండి కానీ, సదరు పొలిటీషియన్ కొడుకు నుండి కానీ ఎలాంటి స్పందన లేకపోవటంతో వీరి రిలేషన్ నిజమే అన్న అనుమానం కలుగుతోంది.

గతంలో కూడా కొంతమంది హీరోయిన్లు పొలిటీషియన్స్ ని పెళ్లి చేసుకున్నారు. పరిణితి చోప్రా, స్వర భాస్కర్, నవనీత్ కౌర్ వంటి వారు ఈ లిస్ట్ లో ఉన్నారు. ఒకప్పుడు టాలీవుడ్లో హీరోయిన్ గా నటించిన భోజ్ పురి భామ రవి రానా అనే పొలిటీషియన్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి ప్రస్తుతం లోక్ సభ ఎంపీగా కొనసాగుతోంది. మరో బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా  పంజాబ్ కి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చడ్డాతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. తాను వెడ్స్ మను, రన్ జానా వంటి సినిమాల్లో నటించిన స్వర భాస్కర్ కూడా పంజాబ్ కి చెందిన సమాజ్ వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్ ని పెళ్లి చేసుకుంది.

మేఘ ఆకాష్ పెళ్లిపై వార్తలొచ్చిన నేపథ్యంలో ఆ పొలిటీషియన్ కొడుకు ఎవరై ఉంటారా అన్న ఆసక్తి నెలకొంది నెటిజన్స్ లో. ప్రస్తుతం డేటింగ్ చేస్తున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని గట్టిగా ప్రచారం జరుగుతున్న క్రమంలో మేఘ నుండి ఎలాంటి స్పందన వస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మేఘ చేతిలో పెద్దగా ప్రాజెక్ట్స్ లేకపోవటం కూడా ఈ రూమర్స్ కి బలం చేకూర్చుతోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు