Vijay Devarakonda: కొండన్న యాటిట్యూడ్ లో ఇంత చేంజా..?

Vijay Devarakonda

విజయ్ దేవరకొండ అనగానే ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ గుర్తొస్తుంది. అర్జున్ రెడ్డి సినిమా టైమ్ నుండి తన యాటిట్యూడ్ చేంజ్ చేసిన రౌడీ హీరో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. కొన్ని సినిమాలకి విజయ్ యాటిట్యూడ్ ప్లస్ అయితే, కొన్ని సినిమాలకి నెగిటివిటీ తెచ్చి పెట్టింది. లైగర్ సినిమా ఇందుకు బెస్ట్ ఎగ్జామ్పుల్ గా చెప్పవచ్చు.

వాస్తవానికి సినిమాలో మ్యాటర్ లేకపోగా విజయ్ యాటిట్యూడ్ పట్ల నెలకొన్న విపరీతమైన నెగిటివిటి వల్ల సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. లైగర్ సినిమా ఎఫెక్ట్ విజయ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఖుషి సినిమా రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో విజయ్ చేసిన పోస్ట్ ఇందుకు నిదర్శనం.

ప్రతిసారి తన యాటిట్యూడ్ ప్రాజెక్ట్ అయ్యేలా ట్వీట్స్ చేసే విజయ్ ఈ సారి చాలా సాఫ్ట్ టోన్ తో ట్వీట్ చేశాడు. తనతో పాటు ఐదేళ్ల నుండి ఈ రోజు కోసం ఎదురు చూసినందుకు ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పిన విజయ్, పాజిటివ్ రెస్పాన్స్ రూపంలో తన ఫోన్ కి వస్తున్న మెసేజ్ లతో ఈ రోజు నిద్రలేవటం తనకు ఆనందంగా ఉందంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు విజయ్.

- Advertisement -

ఈ నేపథ్యంలో లైగర్ ఎఫెక్ట్ వల్ల విజయ్ యాటిట్యూడ్ లో చాలా మార్పు వచ్చిందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ఖుషి సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన క్రమంలో సినిమా యూనిట్ సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. లైగర్, శాకుంతలం లాంటి డిజాస్టర్స్ తర్వాత విజయ్ సమంతలకి ఖుషి సినిమా రూపంలో సక్సెస్ అందటంతో ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు