Tollywood : టాలీవుడ్ లో ప్రకంపనలు

టాలీవుడు, ఒక సమయంలో చిన్న పరిశ్రమనే. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో టాలీవుడ్ ఒక మారుమూల గ్రామంలా ఉండేది. కానీ, ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ను తలదన్నెలా సినిమాలు తెరకెక్కించారు తెలుగు దర్శకులు. హిందీ బెల్ట్ రాష్ట్రాల ప్రేక్షకులు కూడా తెలుగు సినిమాలను ఆదరించడం ప్రారంభించారు. అంత అద్భుతంగా ఎదిగిన టాలీవుడ్ లో ఎన్నో సమస్యలున్నాయి. ముఖ్యంగా నిర్మాతలకు అని చెప్పాలి.

చిన్న స్థాయి హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు. దీంతో నిర్మాణ ఖర్చులు పెరుగుతున్నాయి. వీటితో పాటు రెమ్యునరేషన్ల స్థాయి కూడా పెరుగుతుంది. కొంత మంది స్టార్ హీరోలు 50 కోట్ల పారితోషికం ఉంటేనే సినిమా చేస్తున్నారు. స్టార్ హీరోలు కదా, పాజిటివ్ టాక్ వస్తే లాభాలు వస్తాయని అనుకుంటున్నారు.

అయితే, ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గించారు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే గానీ, థియేటర్ లో జనాలు కనిపించడం లేదు. నేచురల్ స్టార్ నాని ఇటీవల అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాజిటివ్ టాక్ ను కూడా తెచ్చుకున్నాడు. కానీ, ప్రేక్షకులు థియేటర్స్ కు రాలేదు. దీంతో కలెక్షన్లు ఎక్కువగా రాలేదు. అలాగే విరాట పర్వం విషయంలో కూడా ఇలాగే జరిగింది.

- Advertisement -

ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలను చేయాలంటే భయపడిపోతున్నారు. హీరో, హీరోయిన్స్ ఎక్కువ రెమ్మునరేషన్ ఇవ్వలేక పోతున్నారు. కానీ, హీరో, హీరోయిన్లు మాత్రం పారితోషికం వస్తేనే షూటింగ్ కు వస్తున్నారు. ఇటీవల ఓ హీరో పెండింగ్ లో ఉన్న 2 కోట్ల పారితోషికాన్ని ఇస్తేనే షూటింగ్ కు వస్తానని తెల్చి చెప్పాడని వార్తలు వచ్చాయి. ఆ హీరో ఎవరు అనేది పక్కన పెడితే, ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే సమస్య ఉంది.

దీంతో నిర్మాతలు విసిగిపోయారు. హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా సమ్మెకు కూడా వెళ్లాలని నిర్మాతలు ఆలోచన చేస్తున్నారట. సమ్మె పై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒక వేళ నిర్మాతలు సమ్మె బాట పడితే, టాలీవుడ్ లో గందరగోళ పరిస్థితులు రావడం ఖాయం.

మరీ, నిర్మాతల ఆందోళన ఎక్కడి వరకు వెళ్తుందో. రెమ్యూనరేషన్ విషయంలో హీరో, హీరోయిన్స్ తగ్గుతారా అని తెలియాలంటే, మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు