Pawan Kalyan: దర్శక, నిర్మాతల నిరాశ

ఈ రోజుల్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి సినిమాలంటే రెండో ప్రాధాన్యత. దీంతో టాలీవుడ్‌లోని చాలా మంది టెక్నీషియన్లు, నిర్మాతలు నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికే, సగం-షూట్ పూర్తయిన హరి హర వీరమల్లు మరియు ఇంకా ప్రారంభించని భవదీయుడు భగత్ సింగ్‌ సినిమాలను పవర్ స్టార్ అలానే వదిలేశారు. పవన్ మూడు వారాల షెడ్యూల్‌ ను వినోదయ సీతం రీమేక్‌ని పూర్తి చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వినోదయ సీతం షూటింగ్‌ను కూడా పవన్ వాయిదా వేశారు. ఈ సినిమా ఈపాటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, రాజకీయ పనుల్లో బిజీగా ఉన్నానని చివరి నిమిషంలో పవన్ చెప్పాడు. దీంతో మేకర్స్ షూట్‌ని జూలై 21కి వాయిదా వేయాల్సి వచ్చింది. తమిళ ఒరిజినల్ దర్శకుడు సముథ్రఖని ఈ ప్రాజెక్టుకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రస్తుతం తెలుగు, తమిళ పరిశ్రమల్లో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో సముథ్రఖని ఒకరు. షూట్ షెడ్యూల్ ముందుగానే ప్లాన్ చేయబడినందున, సముథ్రఖని వేరే సినిమాలకు ఇచ్చిన డేట్స్ ను సరిదిద్దుకున్నాడు, ఇందుమూలంగా తనపై ఆధారపడిన చిత్రాల షూట్‌లను వాయిదా వేసుకున్నాడు మరియు కొన్ని ఆఫర్‌లను కూడా తిరస్కరించాడు.

పవర్‌స్టార్ షూట్ రద్దు చేయడంతో, నటుడు మరియు దర్శకుడు ఈ గ్యాప్‌లో ఒక షెడ్యూల్ పూర్తి చేసే కొన్ని మంచి ప్రాజెక్ట్‌లను కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇకపోతే వినోదయసీతం 20 రోజుల షూటింగ్ కోసం పవన్ 60 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో ఆయన దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాలో ఎక్కువ భాగం హీరో సాయి ధరమ్ తేజ్ చుట్టూ తిరుగుతుంది. ఏదేమైనా మరి పవన్ కనీసం 21న షూటింగ్‌కి వస్తాడో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు