Mahesh Babu : మరోసారి పొలిటీషియన్ గెటప్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ లో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు తో పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే రొమాన్స్ చేయనుంది. ఇక ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించనున్నాడు.

SSMB28 వర్కింట్ టైటిలతో ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే, త్రివిక్రమ్ సినిమాలో మహేష్ బాబు పాత్ర పై కొన్ని రోజులుగా రూమర్లు నడుస్తుంది. అయితే తాజాగా, దీనిపై మరో వార్త వైరల్ అయింది. ఈ సినిమాలో మహేష్ బాబు మరోసారి పొలిటీషియన్ గెటప్ లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. గతంలో భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు సీఎం పాత్రలో కనిపించాడు.

అలాగే దూకుడు సినిమాలో ఫేక్ ఎమ్మెల్యే పాత్రలో కూడా మహేష్ బాబు మెరిశాడు. ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ సినిమాలో కూడా పొలిటీషయన్ గెటప్ వేయనున్నాడట. ఐటీ శాఖ మంత్రి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఈ పాత్ర తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తరహాలో ఉంటుందని టాక్. అయితే ఈ వార్త ఎంత వరకు నిజమనేది త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా త్రివిక్రమ్ సినిమాలలో హీరో రాజకీయ నాయకుడి పాత్రలో అస్సలు ఉండరని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే, సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు