RC16 : మెగా స్పీడ్

రామ్ చరణ్, టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడు. మెగాస్టార్ కొడుకుగా ఇండస్ట్రికి పరిచయం అయినా, కొద్ది రోజుల్లోనే సొంత ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ధ్రువ, రంగ స్థలం సినిమాలతో తనలోని మరో కోణాన్ని బయట పెట్టాడు. దీంతో రామ్ చరణ్ ఇమేజ్ ఒక్క సారిగా పెరిగిపోయింది. ఇక దర్శకధీరుడు జక్కన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.

ఈ మెగా పవర్ స్టార్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ఇప్పటికే సగం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ RC15 షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ పూర్తి అయితే, దాదాపు 70 శాతం వరకు చిత్రీకరణ పూర్తి అవుతుందని తెలుస్తుంది.

ఈ సినిమా పూర్తి కాక ముందే, రామ్ చరణ్ మరో సినిమా లైనప్ చేసుకుంటున్నాడట. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్నానూరితో RC16 చేయబోతున్నాడు. RC16 కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయట. అంతే కాకుండా, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయని సమాచారం. RC15కు గుమ్మడికాయ కొట్టిన వెంటనే, RC16 సెట్స్ పైకి వస్తుందని తెలుస్తోంది. మొత్తంగా మెగా ఫ్యాన్స్ కు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు