Laal Singh Chaddha: బాలీవుడ్ కి ‘చిరు’ భరోసా

సౌత్ సినిమా ఇప్పుడు ఎల్లలు దాటుతుంది. హాలీవుడ్ దర్శకులు నుండి కూడా ప్రసంశలు అందుకుంటుంది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినిమా వెనుకబడింది అనేది కొంత వాస్తవం. బాలీవుడ్ లో భారీ స్థాయిలో తెరకెక్కిన సినిమాలు ఏవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ తరుణంలో మరో బాలీవుడ్ సినిమాను ప్రోత్సహిస్తూ ప్రోమోట్ చేస్తున్నారు మెగాస్టార్. ఇంతేకాకుండా టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ నటులతో మంచి సంబంధాలను కలిగి ఉన్నారు.

సల్మాన్ ఖాన్ సినిమాలో వెంకటేష్ అతిధి పాత్రలో నటిస్తుండగా, చిరు సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అమీర్ ఖాన్ చిత్రం లాల్ సింగ్ చద్దాలో నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు.
రీసెంట్ గా హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దా సినిమా ప్రత్యేక ప్రివ్యూను సుకుమార్, చిరంజీవి, నాగార్జున , నాగ చైతన్య మరియు రాజమౌళి వీక్షించారు.

అదే విషయాన్ని తెలియజేస్తూ చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ”కొన్ని సంవత్సరాల క్రితం నా ప్రియమైన స్నేహితుడు అమీర్‌ఖాన్ ను క్యోటో విమానాశ్రయం – జపాన్‌ లో కలిసి కాసేపు మాట్లాడుకున్నాం. చాలా ఏళ్ళు తరువాత అతని కలల ప్రాజెక్ట్ #LaalSinghChaddhaలో నేను భాగమయ్యాను. నా ఇంటిలో ప్రత్యేక ప్రివ్యూ ఇచ్చినందుకు #అమీర్‌ఖాన్‌కి ధన్యవాదాలు” అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
అమీర్ ఖాన్, నాగ చైతన్య కీలక పాత్రల్లో నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు