NTR 30 : ఎదురుచూపులకు తెర

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌లే ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సూప‌ర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ త‌న త‌రువాత సినిమాని కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఉండనుంద‌ని ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ సినిమా సెట్స్ మీద‌కు రావ‌డం డిలే అవుతూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నట్టు స‌మాచారం.

ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా సెట్స్ మీద‌కు రాక‌పోవ‌డంతో ఎన్నో రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా క‌థ ఎన్టీఆర్‌కి అంత‌గా నచ్చ‌లేద‌ని.. ఈ క‌థ‌లో కొర‌టాల కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నార‌ని విన్నాం. అంతే కాదు.. కొన్ని సంద‌ర్భాల్లో ‘NTR30’ క్యాన్స‌ల్ అయింద‌ని కూడా వార్త‌లు వినిపించాయి. తాజాగా అందుతున్న స‌మాచారం మేర‌కు నంద‌మూరి అభిమానుల్లో ఉన్న నిరాశ‌ను తుడిపేస్తూ ఈ దీపావ‌ళికి బిగ్ ట్రీట్ ఇవ్వాల‌ని కొర‌టాల ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేసి ఈ సినిమాను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని భావిస్తున్నార‌ట కొర‌టాల‌.

గ‌త కొద్ది రోజులుగా ‘NTR30’ కి సంబంధించి సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న‌ వార్త‌లు వైర‌ల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా ఇందులో హీరోయిన్ విష‌యంపై రోజుకో కొత్త పేరు బ‌య‌టికి రావ‌డం విశేషం. హీరోయిన్ విష‌యంపై కొర‌టాల స్పెష‌ల్ కేర్ తీసుకున్నార‌ని ఆమె క్యారెక్ట‌ర్ సినిమాకు ప్ల‌స్ కానుంద‌ని టాక్ వినిపిస్తోంది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, సుధాక‌ర్ మిక్కిలినేని నిర్మాణంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. గ‌తంలో ఎన్టీఆర్‌-కొర‌టాల శివ కాంబోలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సూప‌ర్ హిట్ కావ‌డంతో మ‌ళ్లీ ఇదే కాంబినేష‌న్‌లో రాబోయే మూవీపై అభిమానులు భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు. నంద‌మూరి అభిమానుల‌కు ఈ దీపావ‌ళికి ఎలాంటి టైటిల్ ప్ర‌క‌టించి ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపుతారో వేచి చూడాలి మ‌రి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు