Aha: అన్స్టాపబుల్ సీజన్ 3 ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలుసా ?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షో గురించి అందరికి తెలిసిందే. ఇప్పటి వరకు విజయవంతంగా రెండు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో లేటెస్ట్ గా మూడవ సీజన్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైంది. కాసేపటి క్రితమే అఫీషియల్ గా సీజన్ 3 ఎనౌన్స్ చేసిన ఆహా మొదటి గెస్ట్ ను కూడా ఆల్రెడీ ఫిక్స్ చేసిందని సమాచారం అందుతోంది.

అయితే అన్స్టాపబుల్ సీజన్ వన్ లో ఎప్పుడు ట్రేండింగ్ లో ఉండే మోహన్ బాబు ఫ్యామిలీ ను ఇన్వైట్ చేసిన అందరిని ఆశ్చర్య పరిచిన ఆహా.. సీజన్ వన్ ఎండింగ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్ తో ముగించారు. ఇక సీజన్ టూ లో ఏకంగా మొదటి ఎపిసోడ్ కు గాను ఏకంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఆహ్యానించారు. దాంతో సీజన్ 2 కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. ఇక సీజన్ 2 చివరికల్లా ఇంటర్వ్యూలకు, టాక్ షో లకు అస్సలు రాని పవన్ కళ్యాణ్ ను రప్పించి అందరిని ఆశ్చర్య పరిచారు.

ఇక లేటెస్ట్ గా చూస్తే సీజన్1,2 ల మాదిరిగానే సీజన్ 3 లో మొదటి గెస్ట్ ఎవరొస్తారనే విషయంపై ప్రస్తుతం అందరి దృష్టి పడింది. అయితే మరి సీజన్ 3 మొదటి గెస్ట్ గా రానుంది మరెవరో కాదు మెగా స్టార్ చిరంజీవి అని సమాచారం అందుతోంది. సినిమాల పరంగా ఎప్పడు కాంపిటీషన్ గా ఉండే బాలకృష్ణ, చిరంజీవి ఒకే స్టేజ్ పంచుకొని చాలా యేళ్లు అయింది. మరి ప్రస్తుతం వినిపిస్తున్న ఈ న్యూస్ నిజమే అయితే అన్స్టాపబుల్ సీజన్3 కూడా సూపర్ హిట్ అయినట్టే అని చెప్పొచ్చు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు