Trivikram: క్లోజ్ ఫ్రెండ్ కి కూడా ఓ మంచి రోల్ ఇవ్వలేకపోయాడు..!

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో “గుంటూరు కారం” సినిమా మెయిన్. ఎందుకంటే వచ్చిన పండగ సినిమాల్లో అన్నిటికంటే పెద్ద సినిమా, పైగా భారీ అంచనాలున్న సినిమా కూడా ఇదే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత రెస్పాన్స్ రాబట్టుకోలేక పోయింది. అయితే మహేష్ బాబు అభిమానులని మాత్రం కొంత మేర మెప్పిస్తుంది. గుంటూరు కారం సినిమా లో త్రివిక్రమ్ డైరెక్షనే మైనస్ అయిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసే సినిమాల్లో సునీల్ కమెడియన్ గా ఓ మంచి పాత్ర చేయడం కామన్. పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్ కెరీర్ మొదట్లో రూమ్ మేట్స్ అన్న విషయం తెలిసిందే. గత పాతికేళ్లుగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన సునీల్ త్రివిక్రమ్ చాలా ఈవెంట్లలో కూడా కలిసి సందడి చేయడం చూసే ఉంటాం. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ఫ్రెండ్ సునీల్ కి తాను డైరెక్ట్ చేసే ప్రతి సినిమాలో ఓ మంచి రోల్ ఇస్తూనే ఉంటాడు. మధ్యలో సునీల్ హీరోగా టర్న్ అయ్యాక కొన్నేళ్లు చేయకపోయినా, ఇప్పుడు మళ్ళీ కమెడియన్ గా చేయడం మొదలెట్టాడు.

అయితే త్రివిక్రమ్ సినిమాలైన నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖలేజా లాంటి సినిమాల్లో సునీల్ కామెడీ ఏ రేంజ్ లో ప్లస్ అయిందో తెలిసిందే. కానీ అలవైకుంఠపురం లో మాత్రం సునీల్ స్థాయి కి తగ్గ పాత్ర ఇవ్వలేదు గురూజీ. ఇక లేటెస్ట్ గా వచ్చిన గుంటూరు కారం లో అసలు సునీల్ ఎలాంటి ప్రిఫరెన్సు ఇవ్వలేదు. గుంటూరు కారం లో సునీల్ ని కేవలం ఒక్క సీన్ లో వాడాడు గురూజీ. గుంటూరు కారం లో కేవలం ఒకే ఒక్క సీన్ లో సునీల్ కనిపిస్తాడు. అది కూడా జగపతి బాబు బ్రదర్ గా సినిమా స్టార్టింగ్ లో.. పైగా ఆ సీన్ అయిపోగానే డైరెక్టర్ ఆ పాత్రని కూడా అక్కడే ఎండ్ చేసేసాడు.

- Advertisement -

ఈ మాత్రం దానికి సునీల్ ని సినిమాలో పెట్టి పరువు తీయడమెందుకు? ఫ్రెండ్ గా మీరు పరువు తీసుకోవడమెందుకు అని సునీల్ డై హార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు. తన క్లోజ్ ఫ్రెండ్ కోసం కనీసం తన సినిమాలో ఒక్క మంచి పాత్ర కూడా ఇవ్వలేకపోయాడు గురూజీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గత కొంత కాలంగా సౌత్ భాషల్లో వరుస సినిమాలతో అదరగొడుతున్న సునీల్ కి ఇలాంటి జూనియర్ ఆర్టిస్ పాత్ర ఇవ్వడం కరెక్ట్ కాదని ట్రేడ్ విమర్శకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కనీసం విలన్ గా అయినా మంచి రోల్ ఇవ్వాల్సిందని, ఇలాంటి సి గ్రేడ్ పాత్ర ఇచ్చి సునీల్ ని అవమానించడం తగదని సోషల్ మీడియా లో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు