Varun Sandesh – Vithika Sheru: షాకింగ్… విడాకుల బాటలో మరో టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్

టాలీవుడ్ లో మరో సెలబ్రిటీ జంట విడాకుల బాట పట్టడం షాకింగ్ గా మారింది. గతకొంత కాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో విడాకులు గోల ఎక్కువైందని చెప్పాలి. సమంత, నాగ చైతన్య నుంచి మొదలు కాగా, ధనుష్ ఐశ్వర్య రాజేష్, శ్రీజ – కళ్యాణ్ దేవ్, నిహారిక – చైతన్య జొన్నలగడ్డ… ఇలా వరుసగా చాలామంది ప్రముఖులు విడాకుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక ఇటీవల మన తెలుగు హీరోయిన్ స్వాతి కూడా విడాకులు తీసుకోబోతున్నట్టు రూమర్స్ వచ్చాయి. అయితే స్వాతి మాత్రం ఆ విషయంపై క్లారిటీ ఇవ్వకుండా నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు అంటూ దాటవేసింది.

ఇక తాజాగా మరో జంట, అది కూడా పాపులర్ షో బిగ్ బాస్ లో భార్యాభర్తలుగా ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన కపుల్ కావడం గమనార్హం. ఇక విషయంలోకి వెళ్తే ఆ జంట ఎవరో కాదు యంగ్ హీరో వరుణ్ సందేశ్ – వితికా షెరు. గత కొంతకాలంగా ఫర్నాజ్ శెట్టి అనే మరో హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నాడని, ఈ విషయం తెలిసిన వితిక ముందుగా వరుణ్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేసిందని, కానీ పరిస్థితులు చేయి దాటి పోవడంతో చివరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వితిక అంటోందని తెలుస్తోంది.

మరోపక్క వరుణ్ సందేశ్ మాత్రం వితిక తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది అని, ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని పద్దతిగా వ్యవహరించమని చెబితే కోపంతో వెళ్ళిపోయింది అని సన్నిహితుల దగ్గర వాపోయాడట. ప్రస్తుతం వీరిద్దరూ విడిగా ఉంటున్నారని సమాచారం. దీంతో ఈ మధ్య వితిక యూట్యూబ్ లో లోదుస్తువుల గురించి పెట్టిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. మరి ఆమె ఫ్యామిలీలో దీని గురించే వివాదం వచ్చి ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

- Advertisement -

అంతేకాదు భరణం గట్టిగా డిమాండ్ చేయాలనే ఉద్దేశంతో వితిక ఉన్నట్టు సమాచారం. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారని అనుకున్న ఈ జంట ఇలా విడాకుల బాట పడుతోంది అని వస్తున్న రూమర్స్ వాళ్ళ అభిమానులను బాధ పెడుతున్నాయి.

బిగ్ బాస్ -3లో ఈ భార్యాభర్తలు జంటగా వచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అంతకుముందు హీరోగా వరుణ్, హీరోయిన్ గా పలు సినిమాలు చేసినప్పటికీ, బిగ్ బాస్ తరువాతే వాళ్ళ క్రేజ్ మరింతగా పెరిగింది. మొత్తానికి ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట కూడా చివరకు విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే వరుణ్ లేదా వితిక స్పందించాల్సిందే.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు