Marriage Life: మ్యారేజ్ లైఫ్ బోర్ కొట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

ప్రస్తుతం ఉన్న తరం పెళ్లి కంటే ఎక్కువగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చాలావరకు పెళ్లి చేసుకోవడానికి వెనకాడుతున్నారని చెప్పాలి. పెళ్లి తర్వాత వచ్చే సమస్యలే అందుకు ప్రధాన కారణం. ఇక కొంతమంది ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసి పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ బంధం ఎక్కువ కాలం నిలవడం లేదు. ఈ జనరేషన్ కు తమ బంధాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలో తెలియకపోవడం ఒక కారణం అయితే? తమ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోలేకపోవడం మరో కారణం. పెళ్లయిన కొత్తలో లైఫ్ లో ఉండే స్పార్క్ కొన్ని రోజుల తర్వాత మసకబారుతుంది. మరి పెళ్లయిన 10- 20 ఏళ్ల తర్వాత కూడా జీవిత భాగస్వామి అంటే బోర్ కొట్టని వాళ్లు ఎంతోమందిని మనం చూస్తూనే ఉన్నాం. మరి వారి మధ్య ఏం వర్క్ అవుట్ అవుతోంది? వాళ్లు అసలు అంతకాలం ఎలా కలిసి ఉంటున్నారు? ఇలాంటి ప్రశ్నలతో సతమతమవుతున్న వారి కోసమే ఈ చిట్కాలు.

1. జీవిత భాగస్వామికి గౌరవం ఇవ్వడం అనేది చాలా అవసరం. ఒకరితో ఒకరు మర్యాదగా ప్రవర్తిస్తే ఆ బంధం ఎక్కువ కాలం నిలబడుతుంది. అలాగే మీరు మీ భాగస్వామి పట్ల శ్రద్ధగా ఉన్నారని వారికి తెలుసేలా చేయండి. అలాగే సందర్భానికి తగ్గట్టుగా వారిపై ప్రశంసలు కురిపించండి.

Tips to avoid getting bored in married life

- Advertisement -

2. మిమ్మల్ని నమ్మి జీవితాంతం మీ వెనక నడవడానికి వచ్చిన వారు బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ అని గుర్తు పెట్టుకోండి. బెటర్ హాఫ్ తో ఫ్రెండ్లీగా ఉండండి. అలాగే కష్టసుఖాలను షేర్ చేసుకోండి.

Tips to avoid getting bored in married life

3. భార్యతో లేదా భర్తతో మన బంధాన్ని బలపరుచుకోవడానికి వారికి రోజుల్లో కొంత సమయం కేటాయించండి. అలాగే ఎప్పటికప్పుడు బయటకు వెళ్లడం, క్యాంపింగ్, హైకింగ్ వంటివి ఇద్దరి ఇష్టాల ప్రకారం ప్రయత్నించండి. కలిసి సినిమా చూడండి. వీటి వలన లైఫ్ లో కాస్త కొత్తదనం వస్తుంది.

Tips to avoid getting bored in married life

4. భాగస్వామితో కలిసి వంట చేయడం వల్ల వారితో కనెక్ట్ అయ్యే మంచి అవకాశం లభిస్తుంది. వంట రాకపోతే కనీసం వారికి వంటలో హెల్ప్ అయినా చేయండి.

Tips to avoid getting bored in married life

5. కేవలం సహాయం చేయడం మాత్రమే కాదు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు నచ్చిన వారి కోసం చేసే కప్పు కాఫీ ఇవ్వడం, వంట చేయడం వంటి పనులు మనతోపాటు జీవిత భాగస్వామికి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి.

Tips to avoid getting bored in married life

6. ఇక వివాహ బంధం నూరేళ్ల పాటు సజావుగా సాగాలంటే అత్యంత ముఖ్యమైన విషయం కమ్యూనికేషన్. జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తడం అన్నది చాలా సాధారణమైన విషయం. అలాంటి సమయాల్లో సైలెంట్ గా ఉండడం కన్నా మీ భాగస్వామి చెప్పేది వినండి లేదా సమస్య పరిష్కారానికి మీరే చొరవ తీసుకోండి.

Tips to avoid getting bored in married life

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు