Mahesh Babu: పార్టులుగా మహేష్ రాజమౌళి సినిమా.. షూటింగ్ ఎప్పుడంటే..?

పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తరవాత మహేశ్ బాబుతో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో జక్కన్న మహేశ్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఆ అంచనాలను రీచ్ అయ్యేలా ఈ సినిమాను జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంతే కాకుండా ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో భారీ విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు.

కాగా స్క్రిప్ట్ కూడా త్వరలోనే పూర్తవుతుందని ఈ ఏడాది చివరలో సినిమా ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభం అవుతాయని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా వచ్చే ఏడాది చివరలో ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుందని సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే రాజమౌళి రెండు పార్టులుగా తీసిన బాహుబలి సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. మొదటి పార్ట్ తో పాటూ సినిమా రెండో పార్టు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా కన్నడ సినిమా కేజీఎఫ్ సైతం రెండు పార్టులు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాలకు కలెక్షన్స్ వర్షం కురిసింది. ఇక మహేశ్ బాబుతో చేయబోయే సినిమా కథ కూడా రెండు పార్టులకు సరిపోయేలా ఉండటం..ప్రేక్షకులు సీక్వెల్స్ ను ఆదరించడంతో రెండు పార్టులుగా తీయాలని నిర్ణయించినట్టు సమాచారం.

- Advertisement -

ఇక జక్కన్న ఒక పార్టు తీయడానికే సాధారణంగా మూడు నాలుగు సంవత్సరాలు సమయం తీసుకుంటాడు. అలాంటిది మహేశ్ బాబుతో సినిమాను రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా రెండు పార్టులు పూర్తి అవ్వాలంటే ఐదారు సంవత్సరాలు ఖచ్చితంగా పట్టాల్సిందే. మరి గబగబా సినిమాలు చేసే మహేశ్ బాబు అన్ని సంవత్సరాలు ఒకే సినిమాకు ఎలా కమిట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జక్కన్న సినిమా అంటే ఎన్నేళ్లు అయినా దానికి తగ్గ ఫలితం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు