Toby: ఫస్ట్ లుక్… రాజ్ బి శెట్టి మరో కిల్లింగ్ అవతార్

కన్నడ విలక్షణ నటుడు, దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రాజ్ బి శెట్టి చాలా రోజుల తర్వాత ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా “టోబి”. రాజ్ బి శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా చార్లీ సినిమాలో వెటర్నరీ డాక్టర్ అంటే ఈజీ గా గుర్తుపడతారు. అయితే ఓటిటి సినిమాలు రెగ్యులర్ గా చూసే ఆడియన్స్ రాజ్ బి శెట్టి అంటే ఖచ్చితంగా గుర్తుపడతారు. ఆయన నటించి, దర్శకత్వం వహించిన “గరుడ గమన వృషభ వాహన” క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి.

ఈ సినిమాలో రాజ్ బి శెట్టి తన అద్భుత నటనతో మెప్పించి విమర్శకుల ప్రశంసలందుకోవడంతో పాటు ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తన లోని నటుడికి పని చెప్తూ “టోబి” అనే సినిమా ద్వారా వస్తున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమాని అనౌన్స్ చేయగా, తాజాగా చిత్ర యూనిట్ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. ఆ పోస్టర్ లో రాజ్ బి శెట్టి రగ్గడ్ లుక్ లో కిల్లర్ లుక్స్ లో కనిపించడమే గాక, పెద్ద ముక్కు పుడక పెట్టుకొని ఉన్నాడు.

ఈ సినిమా అనౌన్స్ చేసినపుడు ఒక పొట్టేలుకి కిల్లర్ లుక్స్ తో డిజైన్ చేసి ఏ విధంగా చుపించారో ఇప్పుడు మళ్ళీ అదే విధంగా రాజ్ బి శెట్టి లుక్ ని రిలీజ్ చేసారు. ఈ లుక్ ద్వారా తన పాత్ర స్వభావాన్ని సినిమాలో చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి కన్నడ లోని చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ టైమ్ నాటికి ఇతర భాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాను ఆగష్టు 25న విడుదల చేస్తునట్టు చిత్ర యూనిట్ తెలిపారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు