PawanKalyan: అంతా “బ్రో”మయం…

ఎప్పుడెప్పుడా అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న “బ్రో” అఫిషియల్ టీజర్ వచ్చేసింది. మాములుగా ఏ స్టార్ హీరో సినిమాకైనా కాంబో ని బట్టి హైప్ పెరుగుతుంది. కానీ పవర్ స్టార్ సినిమాకి మాత్రం పవన్ ని మించిన హైప్ ఉండదు. పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు చొక్కాలు చించేసుకుంటారు ఫ్యాన్స్. ఇప్పుడు మళ్ళీ ఆ టైమ్ దగ్గరికొచ్చేసింది. తాజాగా విడుదలైన “బ్రో” టీజర్ అభిమానులకు ఉన్న ఉత్సాహాన్ని పదింతలు రెట్టింపు చేసింది.

పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన “బ్రో” సినిమాను సముద్రఖని దర్శకత్వం వహించగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టిజి విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల కలిసి నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా పేరుకి వినోదయ సితం కి రీమేకే అయినా స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి తెరకెక్కించారు. దానికితోడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాసిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ చాలా ప్లస్ అవుతాయి.

- Advertisement -

ఇక రిలీజ్ చేసిన టీజర్ ని గమనిస్తే పవన్ కళ్యాణ్ తన పవర్ స్టార్ ట్యాగ్ గుర్తేచ్చేలా పిడుగులా స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. టీజర్ లో ఒక అల్ట్రా మోడ్రన్ గాడ్ లా పవన్ కనిపించబోతున్నాడు. ఇంతకు ముందు గోపాల గోపాల లో అలాంటి పాత్రే చేసినా ఇది అంతకు మించి ఉండబోతుందని తెలిసిపోతుంది. అయితే బ్రో టీజర్ లో ఇతర నటీనటులకు ఛాన్స్ ఇవ్వకుండా పూర్తిగా మామ అల్లుళ్ళ మీదే ఫోకస్ పెట్టడం జరిగింది. నిమిషానికి పైగా నిడివిగల టీజర్ లో ప్రతి ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మాత్రమే ఉంటారు. ఎదో కొసమెరుపుల ఒక్క షాట్ లో ప్రియా వారియర్ అలా బ్లర్ గా కనిపిస్తుంది.

బ్రో టీజర్ కి థమన్ అందించిన నేపథ్య సంగీతం అదిరిపోగా, గ్రాఫిక్స్ పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. ఇక త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఏమి ఇందులో పెట్టలేదు. కానీ చివర్లో “సినిమాలెక్కువ చుస్తావేంట్రా నువ్వు” అని పవన్ చెప్పే డైలాగ్ క్యాచీగా ఉంది. ఓవరాల్ గా టీజర్ లో “బ్రో” అన్న పదమే ఎక్కువ ఉండేలా చూసుకున్నారు. ఇక ఈ సినిమాను జులై 28న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు