Nikhil: ప్రతిసారి స్పై గురించి కాక “ఇండియా హౌస్” గురించి అడుగుతారేంటి?

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రం “స్పై”. జూన్29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇకపోతే కార్తికేయ2 లాగా, స్పై తో మరోసారి పాన్ ఇండియా హిట్ కొట్టాలనుకున్న నిఖిల్ సిద్ధార్థ్ ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్లు జోరుగా చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా రిలీజ్ డేట్ పై క్లారిటీ కూడా లేని ఈ చిత్ర యూనిట్ హడావిడిగా సినిమా రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా రోజుకు రెండు మూడు ఇంటర్వ్యూ లు ఇస్తూ చిత్ర యూనిట్ బాగా బిజీ అయ్యారు. పైగా పాన్ ఇండియా సినిమా కావడంతో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ప్రమోషన్లు చేయాల్సి వస్తుంది.

అయితే “స్పై” గురించి ఇస్తున్న అన్ని ఇంటర్వ్యూల్లోనూ ఒక కామన్ అప్డేట్ గురించి మాత్రం నిఖిల్ కి రిపీట్ చేస్తూ మరి అడుగుతున్నారు. అదే “ది ఇండియా హౌస్” అప్డేట్. యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్ లలో ఒకరైన విక్రమ్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి ప్రారంభించిన “వి మెగా పిక్చర్స్” బ్యానర్ లో ఈ సినిమా రాబోతుంది. ది ఇండియా హౌస్ సినిమాను వీర సావర్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా. రామ్ వంశీ కృష్ణ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాని ఈ సినిమా 2024 సమ్మర్ లో విడుదల అవుతుంది.

అయితే నిఖిల్ స్పై గురించి ఇస్తున్న అన్ని ఇంటర్వ్యూల్లో ఆ సినిమా గురించి కాకుండా రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ గురించే ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. మొదట చాలా ఎక్సయిటింగ్ గా ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్న నిఖిల్ ఆ తర్వాత ఈ సినిమా గురించి స్క్రిప్ట్ గురించి ఎక్కడ బయటపెడతామెమో అని కంగారు పడుతున్నాడు. ఇటు మీడియా కూడా ది ఇండియా హౌస్ సినిమా ఎంత క్రేజీ సినిమా అయినా కూడా స్పై ని ఎక్కువ ప్రమోట్ చేయకుండా వేరే మూవీ గురించి ఎక్కువగా అడగడం చిత్ర యూనిట్ కి కూడా అంతగా నచ్చడం లేదని తెలుస్తుంది. మరి రామ్ చరణ్ తో సినిమా అంటే అలా ఉంటది మరి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు