7:11PM: మంచి రెస్పాన్స్ దక్కించుకున్న టైమ్ ట్రావెల్ మూవీ ట్రైలర్… కానీ?

టాలీవుడ్ లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా 7:11PM అనే సినిమా వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లు అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకోగా, ఈ సినిమాకి ఫుల్ పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. తాజాగా ఈ సినిమా యొక్క అఫిషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది.

మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో విడుదలవుతున్న ఈ సినిమాను అర్కస్ ఫిల్మ్స్ బ్యానర్ లో నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి సంయుక్తంగా నిర్మించగా, చైతు మాదాల దర్శకత్వం వహించడం జరిగింది.ఇక ఈ సినిమాలో సాహస్ పగడాల హీరోగా, దీపికా, టెస్ వాల్ష్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకు శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో సినిమాటోగ్రఫీ అందించగా, ఓం రమేష్ గ్రాఫిక్స్ అందించిన గ్రాఫిక్స్ బాగుంది.

- Advertisement -

7:11PM సినిమాలో హీరో పలు కారణాల వల్ల గతం నుండి భవిష్యత్ కి వస్తాడు? అసలు ఎందుకు వచ్చాడు? తిరిగి తన టైమ్ కి వెళ్లాడా లేదా? అనేదే కథ. సినిమా లో అంతా కొత్త నటీనటులనే ఎక్కువగా తీసుకోవడం జరిగింది. ఇక ట్రైలర్ కి గ్యాని అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరవాలేదనిపించగా, కెమెరా వర్క్ పై ఇంకొంచెం దృష్టి పెట్టాల్సింది. అయితే ఈ ట్రైలర్ లో చాలా మందికి డబ్బింగ్ లిప్ మూమెంట్ మ్యాచ్ కాలేదని తెలుస్తుంది. చిత్ర యూనిట్ అది గమనించి రిలీజ్ టైమ్ వరకు చేంజ్ చేసుకుంటే మంచిది. ఇక ఈ సినిమాను జులై 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు