Jayam: హీరోయిన్ సదా తో మిస్ బిహేవ్ చేసిన తెలుగు హీరో..!

Jayam:

నటి సదా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యంగ్ హీరో నితిన్ నటించిన జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ బ్యూటీ. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో సదాకు మంచి పేరు వచ్చింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగులో దూసుకుపోయింది ఈ మరాఠీ భామ. ఆ తరువాత టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన అపరిచితుడు సినిమాతో భారీ హిట్ అందుకుంది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ కి తమిళనాట కూడా మంచి గుర్తింపు వచ్చింది.

అయితే ప్రస్తుతం సినిమాలు తగ్గించింది సదా. పలు టీవీ షోలలో జడ్జిగా చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం సరికొత్త లుక్స్ తో కనిపిస్తూ యువత మతులు పోవడుతోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లు ధరిస్తూ తన హాట్ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో యువతని రెచ్చగొడుతుంది. అయితే తాజాగా సదా కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ స్టార్ హీరో ఆమెతో మిస్ బిహేవ్ చేశాడట. ఆమె ఎంత వద్దని మొత్తుకున్నా కూడా ఆ హీరో అలానే చేయడంతో ఎంతగానో ఇబ్బంది పడిందట.

సదా నటించిన మొదటి సినిమా జయంలో సీన్స్ పరంగా ఓ రొమాంటిక్ సీన్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ సీన్ చేయడానికి దర్శకుడుని ముప్పు తిప్పులు పెట్టిందట సదా. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ అయ్యి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ సరే ఈ సినిమాలోని ఆ సన్నివేశాన్ని చూస్తే సదకి కంపరంగా అనిపిస్తుందట. ఈ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్లో ఆమె గుడిలో ప్రదర్శనలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎవరికి తెలియకుండా నితిన్ ని కలిసేందుకు వెళుతుంది. అది కనిపెట్టిన విలన్ గోపీచంద్ ముందుగానే అక్కడికి చేరుకుని వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. ఆ సమయంలో గోపీచంద్ సదా నీ తన నాలికతో చెంపపై నాకుతాడు. అయితే ఈ రొమాంటిక్ సీన్ ని తాను చేయానంటే చేయనని ఎంతగానో పట్టు పట్టిందట సదా. కావాలంటే సినిమా నుంచి తీసేయమని కూడా చెప్పిందట. కానీ దర్శకుడు మాత్రం అస్సలు వినకుండా నువ్వు ఈ సీన్ చేయాల్సిందే అని చెప్పారట. ఆఖరికి గోపీచంద్ కూడా వద్దు అని చెప్పారట. కానీ దర్శకుడు గోపీచంద్ పైనే ఫైర్ అయ్యారట.

- Advertisement -

ఇక చివరికి అందరూ సర్థిచెప్పడంతో ఇష్టం లేకపోయినాప్పటికీ సదా ఆ సీన్ ని ఒప్పుకుంది. ఆ సీన్ అయిపోయిన తర్వాత ఏకంగా పదిసార్లు తన ఫేస్ వాష్ చేసుకుని ఇంటికి వెళ్లి ఎన్నోసార్లు ఏడ్చిందట. ఇప్పటికీ ఆ సన్నివేశాన్ని టీవీలో చూసినప్పుడు ఆమె ఎంతో అసభ్యంగా ఫీల్ అవుతుందట.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు