Power Star: పవన్ ను ఆశ్రయించిన శ్రీజ – ఏం జరుగుతుందో..!

మెగా డాటర్ శ్రీజ పెళ్లి ఎంత వివాదాస్పదం అయ్యిందో ఆ తర్వాత ఆమె జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయం అంతే వివాదాస్పదం అవుతూ వస్తుంది. మొదటి భర్త భరద్వాజ్ తో విడాకులు తీసుకున్న శ్రీజ చాలా కాలం పాటు చిరంజీవి వద్దే ఉంటూ వచ్చింది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ తో పరిచయం ఇరు వర్గాల అంగీకారంతో పెళ్లి వరకు వచ్చింది. ఏమైందో తెలీదు కానీ కళ్యాణ్ దేవ్ తో కూడా డైవర్స్ తీసుకుంది శ్రీజ, సినిమాల్లో ఛాన్సుల కోసమే శ్రీజను పెళ్లి చేసుకున్నాడంటూ టాక్ కూడా వచ్చింది ఆ మధ్య. శ్రీజ వ్యవహారంతో విసిగిపోయిన చిరంజీవి, ఇకపై ఎవర్నైనా పెళ్లి చేసుకొని సినిమాల్లో సపోర్ట్ కోసం వస్తే తనకు సంబంధం లేదని తేల్చి చెప్పాడంటూ టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా శ్రీజ మూడో పెళ్ళికి సిద్దమైందంటూ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై ఎటువంటి క్లారిటీ లేనప్పటికీ, ఈ మూడో పెళ్లి వ్యవహారం గురించి శ్రీజ పవన్ కళ్యాణ్ ను ఆశ్రయించింది అన్న టాక్ కూడా వినిపిస్తోంది. చిరంజీవి నుండి ఎలాంటి సపోర్ట్ రాదన్న సంకేతాలు రావటంతో శ్రీజ ఈ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. చిరంజీవి ఇంటి వెనుకనే శ్రీజ కోసం మరో ఇల్లు కూడా నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే.

తాజాగా వినిపిస్తున్న కథనం ప్రకారం మూడో పెళ్లి విషయమై శ్రీజ పవన్ కళ్యాణ్ ను ఆశ్రయించటం నిజమే అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎలా స్పందించాడు, శ్రీజ నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతుంది. మెగాఫ్యామిలీ నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండబోతుంది అన్న అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు