Heroine : తీవ్ర గాయాలు

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అలనాటి అందాల తార టబు. ఈ నటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టబు, నాగార్జునతో కలిసి నటించిన సినిమాల ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. తన అందంతో ప్రేక్షకులను అలరించిన టబు, తెలుగుతోపాటు, హిందీ, మలయాళం, ఉర్దూ, తమిళ్, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ వంటి భాషా చిత్రాలలో నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇకపోతే నాలుగు పదుల వయసు దాటినప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తూ మంచి పాపులారిటీని దక్కించుకుంది.

తాజాగా హీరోయిన్ టబు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బోలా సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇందులో టబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సెట్ లో పెను ప్రమాదం చోటు చేసుకుందట. ఈ ప్రమాదంలో హీరోయిన్ టబు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది.

టబు కంటికి గాయమై, రక్తస్రావం జరిగిందట. బోలా షూటింగ్ లో భాగంగా ఓ యాక్షన్ సన్నివేశం కోసం.. టబు దట్టమైన అడవిలో ట్రక్కు నడుపే సీన్ ఉంటుంది. అదే సమయంలో టబును బైక్ పై కొందరు విలన్లు వెంబడిస్తుంటారు. ఈ క్రమంలోనే టబు ప్రయాణిస్తున్న ట్కక్కును వేగంగా వస్తున్న బైకు బలంగా ఢీ కొట్టినట్టు సమాచారం. దీంతో ట్రక్కు అద్దాలు పగిలి టబుకు గాయాలయ్యాయి అని తెలుస్తోంది. వెంటనే టబును ఆస్పత్రికి తరలించారట. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు