Allu Arjun : భారీ ఆఫర్ రిజెక్ట్

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. బన్నీ నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సినీ ప్రపంచాన్ని ఒక ఊపు ఉపింది. పుష్ప సినిమాకు సీక్వెల్ త్వరలోనే రానుంది. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. కాగా బన్నీ మాత్రం ఈ ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా, యాడ్స్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, సుకుమార్ వంటి దర్శకత్వంలతో బన్నీ పలు యాడ్స్ చేశాడు.

ఈ యాడ్స్ కు ఒక్కొదానికి 7.5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఒక్కొ యాడ్ కు తన లుక్ ను మార్చుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ వస్తున్నాడు. అయితే ప్రస్తుతం బన్నీ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త ఎక్కువగా వినిపిస్తుంది. ఒక ప్రముఖ బ్రాండ్ తన ప్రొడక్ట్ కు అంబాసిడర్ గా ఉండాలని, దానికి యాడ్ చేయాలని బన్నీని కోరిందట. బన్నీ తీసుకునే పారితోషికం కంటే ఎక్కువగా ఇస్తామని చెప్పారట. ఒక్క యాడ్ కే 10 కోట్లు ఇస్తామని ఆఫర్ కూడా చేశారట.

కానీ ఐకాన్ స్టార్ ఈ భారీ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం అందుతుంది. బన్నీ తిరస్కరించింది.. ప్రముఖ ఇంటర్నేషనల్ విస్కీ బ్రాండ్ అని తెలుస్తుంది. ప్రజల ఆరోగ్యానికి హానీ కలిగించి బ్రాండ్ లకు తాను యాడ్ చేయాలేనని తెగేసి చెప్పారట. ఈ వార్త కాస్త బయటకు రావడంతో బన్నీ ఫ్యాన్స్.. తమ అభిమాన హీరో గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ హీరోల డబ్బుల కోసం ప్రజలకు హానీ చేసే బ్రాండ్ లకు పని చేయడని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు