Indian 2 : మరో స్టార్ హీరోయిన్

విక్రమ్ సూపర్ హిట్ తో కమల్ హాసన్ మంచి జోష్ తో ఉన్నారు. విక్రమ్ చిత్రం కంటే ముందు వచ్చినవి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేదు. కానీ విక్రమ్ హిట్ తో కమల్ కెరీర్ కు పూర్వ వైభవం వచ్చింది. వెంటనే భారతీయుడు 2 ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి దర్శకుడు శంకరను తొందరపెట్టాడు. దీంతో ఆర్సీ 15 షూటింగ్ దశలో ఉండగానే, భారతీయుడు 2 షూటింగ్ ప్రారంభించడానికి శంకర్ సిద్ధమయ్యాడు. వచ్చే నెలలో భారతీయుడు 2 షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది.

భారతీయుడు 2 షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సింది. కానీ షూటింగ్ లో ప్రమాదం, నిర్మాతలకు శంకర్ కు మధ్య వివాదాలతో వాయిదా పడింది. తాజాగా మళ్లీ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ పెళ్లికి ముందే హీరోయిన్ గా ఖరారు అయింది. కాజల్ పెళ్లి అయిపోవడం, ఒక కొడుకు జన్మనివ్వడం కూడా జరిగిపోయింది. మళ్లీ సినిమాలకు రీ ఎంట్రీ ఇవ్వడానికి కాజల్ చూస్తుంది.

తాను సినిమాలకు రీ ఎంట్రీ భారతయుడు 2 తోనే ఉంటుందని కాజల్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ చిత్రంలో కాజల్ తో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందని సమాచారం అందుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. రకుల్ ప్రీత్ సింగ్. త్వరలోనే రకుల్ ప్రీత్ సింగ్ భారతీయుడు 2 సెట్స్ లో కనిపించబోతుందని తెలుస్తుంది. అయితే దీనిపై మూవీ టీం నుండి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు