Nagarjuna: నాగార్జున ఫ్లాప్ మూవీలో అర్జున్ రెడ్డి డైరెక్టర్ ని గమనించారా..?

ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఈయన బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇక ఈ నేపథ్యంలోనే సందీప్ వంగాకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి. తెలుగులో పలు సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఆ తర్వాత 2017లో అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సక్సెస్ అందుకున్నారు.

విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా వచ్చిన రా అండ్ రస్టిక్ లవ్ ఇంటెన్స్ స్టోరీ అర్జున్ రెడ్డి యువతకు బాగా కనెక్ట్ అయి భారీ విజయం అందుకుంది. అంతేకాదు కేవలం రూ .5 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.20 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సూపర్ హిట్ అందుకుంది. ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఎలాంటి సినిమా తీస్తారో అని అందరూ అనుకున్నారు కానీ బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో ఏకంగా అర్జున్ రెడ్డి సినిమాని కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్ , కియారా అద్వానీ హిందీలో జంటగా తెరకెక్కించగా అక్కడ కూడా ఈయనే దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా అక్కడ మంచి విజయం సాధించడంతో బాలీవుడ్ లో కూడా పేరు లభించింది.

ఇకపోతే ఈ సినిమాని భూషణ్ కుమార్ నిర్మాణంలో బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టి సిరీస్ నిర్మించింది. ఇక సినిమా మంచి విజయం సాధించడంతో మరో మూడు భారీ సినిమాలను అనౌన్స్ చేసి సందీప్ డైరెక్షన్లోనే నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం యానిమల్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న ఈయన ఇప్పటికే ప్రభాస్ తో స్పిరిట్, అల్లు అర్జున్ తో ఒక సినిమా కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా సందీప్ రెడ్డి వంగ ఒక సినిమాలో నటించారని.. అంతే కాదు ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారని బహుశా చాలామందికి తెలియదని చెప్పాలి.

- Advertisement -

అదే అక్కినేని నాగార్జున నటించిన కేడి మూవీ.2010 ఫిబ్రవరి 12న కిరణ్ కుమార్ దర్శకత్వంలో కామాక్షి కళా మూవీస్ పతాకం పై డి శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో బోట్ లో ఫైట్ సీన్ జరిగే సన్నివేశంలో సందీప్ రెడ్డివంగా నటించడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చాలా వైరల్ గా మారింది. అంతేకాదు ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు