Sandeep Vanga: నాగార్జున బాటలో సందీప్ వంగా.. అందుకే వెళ్ళనంటూ..!

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాతో భారీగా పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న ఈయన.. అటు బాలీవుడ్ లో కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న యానిమల్ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక డిసెంబర్ 1 న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈ డైరెక్టర్ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే ప్రమోషన్స్ లో భాగంగా.. ఆయన తీసే సినిమాలలో ఎమోషన్స్ స్థాయి ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎన్నో భావోద్వేగాలతో సినిమాలు తీసే మీకు ఎమోషనల్ సపోర్టు ఎవరు? అని అడగగా.. దానికి సందీప్ మాట్లాడుతూ.. మా అమ్మ సుజాత.. ఒకప్పుడు నాకు ఎమోషనల్ సపోర్టు.. 2019లో అమ్మ క్యాన్సర్ తో మరణించింది. అర్జున్ రెడ్డి విడుదలైన రెండు నెలలకి ఆమెకు క్యాన్సర్ అని తెలిసింది. ఏం చేయాలో అర్థం కాలేదు..నా జీవితం ఆగిపోయింది అనుకున్నాను.. ఎందుకంటే మరణానికి సంబంధించిన ఎమోషన్స్ నన్ను మరింతగా బాధపెట్టాయి.. భయపెట్టాయి..

ఇక నా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకి కూడా వెళ్లేవాడిని కాదు.. కొద్దికాలం పోయిన తర్వాత వారిని ఓదార్చడానికి వెళ్లేవాడిని.. అలాంటి నాకు అమ్మకి క్యాన్సర్ అనే వార్త ఒక పెద్ద విషాదం. కబీర్ సింగ్ విడుదలైన రెండు నెలలకు అమ్మ కూడా మరణించింది. ఇక నా జీవితంలో అదే అతిపెద్ద దుర్ఘటన. ఇక నా ఉద్దేశంలో లైఫ్ మూవ్స్ ఆన్ అని ఎవరైతే అన్నారో వారు చాలా గొప్పవారు. అమ్మ లేకపోతే జీవితం ఏమైపోతుంది అనుకున్నాను..కానీ జీవితం అనేది నడుస్తూనే ఉంది..

- Advertisement -

ఏదైనా సమస్య వచ్చినప్పుడు అమ్మ లేకుండానే జీవితం నడుస్తోంది ఈ సమస్య ఒక లెక్క అని అనుకుంటాను అంటూ సందీప్ రెడ్డివంగా వెల్లడించారు. అయితే ఇప్పుడు సందీప్ ఇలా చెప్పడంతో నాగార్జునను అందరూ గుర్తు చేసుకుంటున్నారు.. నాగార్జున కూడా అంతే ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలకు ఆయన హాజరుకారు . కారణం భావోద్వేగానికి గురవుతామన్న ఒక కారణంతోనే ఆయన అంత్యక్రియలకు వెళ్ళరు. ఇప్పుడు ఆయన బాటలో సందీప్ రెడ్డి వంగ కూడా ఇదే మాటే చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు