Varun Tej: భార్య పై దుష్ప్రచారం.. ఫైర్ అయిన వరుణ్ తేజ్..!!

టాలీవుడ్లో మెగా హీరోగా వరుణ్ తేజ్ మంచి పాపులారిటీ సంపాదించారు.గడిచిన కొద్దిరోజుల క్రితం హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు.వీరి పెళ్లి ఇరువురు పెద్దల సమక్షంలో చాలా గ్రాండ్ గా ఇటలీలో జరిగింది.వీరి వివాహం పూర్తి అయ్యి ఇంకా నెలరోజులు కాకముందే వరుణ్ తేజ్ సినిమాల గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా సినిమా ఆగిపోయింది అని.. బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపించాయి.

ఇలాంటి వార్తలు అన్నిటిని కూడా వరుణ్ తేజ్, లావణ్య వివాహానికి ముడి పెడుతూ పలు రకాల యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్లో వార్తలు రావడం జరిగిందట.దీంతో తన భార్య గురించి ఇలాంటి మాటలు మాట్లాడడం బాగలేదని వరుణ్ తేజ్ ఫైర్ కావడం జరిగింది..

ఇకమీదట ఇలాంటి రూమర్స్ ఎవరైనా సృష్టించే ముందు కాస్త ఆలోచించి వారి మనోభావాలు దెబ్బతింటాయా లేదా అనే విషయాన్ని ఆలోచించి రాయాలని ఫైర్ అయ్యారు.దీంతో వరుణ్ తేజ్ వెంటనే మట్కా సినిమా గురించి అధికారికంగా ప్రకటన ఇవ్వడం జరిగిందట.డైరెక్టర్ కరుణ కుమార్ తో కలిసి మొదటిసారి పాన్ ఇండియా చిత్రంలో నటిస్తూ ఉన్నారు.రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు.వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉండగా వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమా 1958-1982 మధ్యలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.అప్పట్లో వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కించే సన్నివేశాలు ఉండడంతో అందుకు సంబంధించి షూటింగ్ సెట్ కూడా వేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇందుకోసం హైదరాబాదులో ఓల్డ్ వైజాగ్ సిటీని తలపించే విధంగా భారీ సెట్టుని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.ఏకంగా నలుగురు ఫైట్ మాస్టర్లతో ఇందులోని చాలా సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట.దాదాపుగా 20 ఏళ్ల కిందట కలిగిన కథాంశంతో విభిన్నమైన గెటప్పులతో ఇందులో వరుణ్ తేజ్ కనిపించబోతున్నట్లు సమాచారం

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు