Samantha: మళ్ళీ పెళ్లి పై ప్రశ్న.. సమంత సమాధానం ఏంటంటే..?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. దాదాపుగా కొన్నేళ్లపాటు ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండేది.. ఇటీవల సమంత పలు రకాలు అనారోగ్య సమస్యలు వల్ల కొన్ని రోజులుగా సినిమాలకు గ్యాప్ ఇస్తూ వస్తోంది. సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఎక్కువగా ఆరోగ్యం పైన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తున్నది. ఈ రెస్ట్ మోడ్ లో ఆమె పలు విదేశాలకు తిరుగుతూ మానసిక ప్రశాంతత కోసం పలు రకాలుగా ట్రై చేస్తూనే ఉంది.

అమెరికా, భూటాన్ వంటి ప్రాంతాలకు వెళ్లి ఇటీవల హైదరాబాద్ కి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం సమంతా.. నాని నటించిన హాయ్ నాన్న సినిమాని తన ఫౌండేషన్ పిల్లలతో కలిసి చూసినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా తన ఫౌండేషన్ లోని పిల్లల దగ్గరే జరుపుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. నిన్నటి రోజున సమంత ఫ్రీగా ఉండడంతో ఇంస్టాగ్రామ్ లో పలు రకాల స్టోరీలలో పలువురు నెటిజెన్స్ ప్రశ్నలు అడగగా.. అందుకు సమాధానాన్ని తెలియజేయడం జరిగింది సమంత.

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ సమంత మీరు మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఉందా అని అడగగా.. అందుకు సమాధానంగా సమంత ఇలా తెలియజేస్తూ.. కీ డివోర్స్ స్టాటిస్టిక్ అనే నివేదికను షేర్ చేసి.. దీని ప్రకారం పెళ్లి అనేది ఒక బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అని తెలియజేసింది. సమంత షేర్ చేసిన ఈ రిపోర్టులో మొదట సారి పెళ్లి చేసుకున్న వారు 50% విడిపోయి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. రెండవసారి వివాహం చేసుకున్న వారు 67% విడిపోయే అవకాశాలు ఉన్నాయని.. మూడవసారి వివాహం చేసుకున్నవారు 70% విడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలియజేసింది.

- Advertisement -

దీంతో సమంత ఇండైరెక్టుగా ఇంకో వివాహం చేసుకోవాలనే ఉద్దేశం లేదంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో లైఫ్ లాంగ్ ఇంకో పెళ్లి చేసుకోకుండా సమంత ఇలాగే ఉండబోతుందని విషయం అభిమానులకి తెలిసి పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో తనకు నచ్చిన వరుడు దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అంటూ అభిమానులు సైతం సమంతాకు పలు రకాలుగా సలహాలు ఇస్తున్నారు. నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత కేవలం నాలుగేళ్లలోపే విడిపోవడంతో సమంత ఈ విషయం పైన చాలా కృంగిపోయిందని చెప్పవచ్చు.

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు