Extra ordinary man: డిస్ట్రిబ్యూటర్స్ కి అండగా నిర్మాత.. ఆ హామీ ఇస్తూ..!

ఇటీవల కాలంలో యంగ్ హీరో నితిన్ నటించిన చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇటీవలే డైరెక్టర్ వక్కంతం వంశీ, నితిన్, శ్రీ లీలా కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఎక్స్ట్రాడినరీ మ్యాన్.. ఈ చిత్రం డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సినిమా మొదటి షో నుంచి కాస్త మిక్స్డ్ టాక్ ను అందుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక రేంజ్ లో అయిన కలెక్షన్స్ వస్తాయని అభిమానులు , చిత్ర బృందం అనుకున్నారు. కానీ అన్నిటికీ మించి ఈ సినిమా కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో డిస్ట్రిబ్యూటర్స్ కి అండగా నిర్మాత నిలుస్తున్నట్లు సమాచారం. వాటి గురించి తెలుసుకుందాం.

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ , ట్రైలర్ మంచి రెస్పాన్స్ లభించింది.. అయితే ఈ సినిమా టాక్ అయితే బాగానే వచ్చినా.. బాక్స్ ఆఫీస్ వద్ద ఆశింన స్థాయిలో కలెక్షన్స్ ని ఆకట్టుకోలేకపోతోంది . దీంతో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ప్రకారం .. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.25 కోట్ల రూపాయల వరకు జరిగిందట.. అయితే ఇప్పటివరకు ఈ సినిమా కేవలం ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల రూపాయల షేర్ ను మాత్రమే రాబట్టింది..

దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇంకా 20 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉన్నది. ఇది అసాధ్యమని కూడా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే నితిన్ తనను నమ్మి సినిమాను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లకు సైతం ఈ సినిమా వల్ల నష్టం వస్తే రూ.7కోట్ల రిటర్న్ ఇవ్వాలనే విషయాన్ని నితిన్ తండ్రి అగ్రిమెంట్ లో రాయించినట్లుగా తెలుస్తున్నది. అంతేకాకుండా ఇది నిర్మాతగా ఆదుకునే బాధ్యత అని కూడా చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది నితిన్ తండ్రి..

- Advertisement -

నితిన్ సొంత బ్యానర్ లో ఈ సినిమా నిర్మించినట్లుగా తెలుస్తున్నది.. హీరో నితిన్ తన తండ్రి సుధాకర్ రెడ్డి ఇద్దరు కూడా డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి 80 శాతం వరకు వచ్చిన నష్టాన్ని సైతం క్లియర్ చేస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది . ఈ హామీ ఇవ్వడం అనేది మాత్రం ఒక గొప్ప విషయం బయ్యర్లకు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా నితిన్ , నితిన్ తండ్రి చేస్తున్న పనికి ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు