Michael: ఆ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్న సందీప్ కిషన్

ఇటీవలనే చిన్న సినిమాగా రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఒక చిన్న సినిమా నిజానికి సందీప్ కిషన్ చేయవలసిన సినిమా అని ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో ఊరు పేరు భైరవకోన అనే మిస్టరీ థ్రిల్లర్ సినిమా చేస్తున్న సందీప్ కిషన్ ఈ సినిమాకు ముందు ఒక ఫ్యామిలీ ఒరిఎటెంటెడ్ సినిమా కథ విన్నాడట, అయితే కథ ఆయనను విపరీతంగా నచ్చి డేట్స్ కూడా ఆల్మోస్ట్ ఇచ్చేసే టైం లో మైఖేల్ సినిమా ఒప్పుకోవలసి వచ్చిందట.

తమిళ్ డైరెక్టర్ రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైఖేల్ సినిమాలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సంవత్సరం ప్రథమార్థంలో రిలీజై , డిజాస్టర్ గా నిలిచిన ఈ మైఖేల్ సినిమా.. నిజానికి ఇప్పుడు సెట్స్ పైకి వెళ్ళవలసి ఉండగా, విజయ్ సేతుపతి డేట్స్ అనుకున్న దానికంటే ముందే డేట్స్ కన్ఫామ్ చేయడం మూలాన మైఖేల్ షూటింగ్ అనుకున్న దానికంటే ముందే షూట్ చేసి, రిలీజ్ చేయవలసి వచ్చింది.

దాంతో సందీప్ కిషన్ చేయవలసిన ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాస్తా వేరే హీరో చేతికి వెళ్లిపోయింది. కాగా సందీప్ కిషన్ మైఖేల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవగా, ఆయన చేయవలసిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

- Advertisement -

ఇంతకు ఆ సినిమా ఏమై ఉంటుంది అనుకుంటున్నారా.. ? ఇటీవలనే రిలీజైన సామజవరగమన. శ్రీ విష్ణు హీరోగా, రెబ మోనికా జాన్ హీరోయిన్ గా , సీనియర్ యాక్టర్ నరేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దింతో సందీప్ కిషన్ రూమర్ కాస్త బయటికి వచ్చి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఫ్లాప్ సినిమా కోసం సూపర్ హిట్ సినిమా వదులుకున్న సందీప్ కిషన్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మిమ్స్ వేస్తున్నారు

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు