Rashmika: దేవరకొండ ఇంటికి కోడలుగా రష్మిక.. ఒక్క మాటతో కన్ఫర్మ్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రష్మిక , విజయ్ దేవరకొండ జంటకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే . ఎప్పటినుంచో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని.. వివాహం కూడా చేసుకుంటారు అంటూ వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయంపై ఇద్దరూ కూడా సైలెంట్ గా ఉండడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు. వాస్తవానికి వీరిద్దరూ కలిసి వెకేషన్ లకి వెళ్తారు కానీ ఫోటోలు మాత్రం షేర్ చేయరు. అయితే వీరు విడివిడిగా ఫోటోలు షేర్ చేసిన వాటిని డీకోడ్ చేస్తూ వారిద్దరూ ఒకే చోట ఉన్నారన్న విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఉంటారు నేటిజెన్లు.

ఇలా ఎన్నోసార్లు వీరిద్దరూ కలిసి బయటకు వెళ్లినా.. ఎవరికి తెలియకుండా మ్యానేజ్ చేసామని అనుకున్నారు. కానీ చాలా వరకు వీళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నారన్న విషయాన్ని నెటిజన్లు పసిగట్టారని చెప్పాలి. అయినా సరే తమ బంధాన్ని మాత్రం వీరు రివీల్ చేయలేదు. అంతేకాదు వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారని జనాలు కూడా ఫిక్స్ అయ్యారు. మొన్నటికి మొన్న రష్మిక యానిమల్ ప్రమోషన్స్ కోసం బాలయ్య అన్ స్టాపబుల్ షోకు రావడం, అందులో విజయ్ ఫోన్ కాల్, రష్మిక మాటలు, రణ్ బీర్ కపూర్ లీక్ చేసిన విషయాలతో అందరికీ మరోసారి బలమైన అభిప్రాయం కూడా ఏర్పడింది. ఈ ఇద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని అంతా అనుకోవడానికి ఈ ఎపిసోడ్ మరింత బలం చేకూర్చింది.

ఇదిలా వుండగా తాజాగా రష్మిక మాట్లాడిన మాటలు, విజయ్ దేవరకొండ తల్లి గురించి చెప్పిన మాటలు వింటే మాత్రం ఇక ఆ ఇంటికి ఈమె కోడలిగా కన్ఫామ్ అయినట్టుగానే కనిపిస్తోంది. యానిమల్ ప్రమోషన్స్ కోసం రష్మిక ఓ సింగింగ్ షోకు వెళ్లింది. అక్కడ ఓ దివ్యాంగురాలైన గాయనిని రష్మిక మెచ్చుకోవడం తో పాటూ ఈ గాయని అంటే మాధవి దేవరకొండకి సైతం చాలా ఇష్టమట.అదే విషయాన్ని రష్మిక చెబుతూ.. మా ఇంటి నుంచి ఈ విషెస్ వచ్చాయి.. మాధవి ఆంటీ.. నాకు సెకండ్ మదర్ లాంటి వారు.. ఆమెకు కూడా నువ్వంటే చాలా ఇష్టమని ఆ గాయనికి చెప్పింది రష్మిక. ఇకపోతే విజయ్ తల్లి.. తనకు కూడా తల్లి లాంటిదే అని రష్మిక చెప్పడంతో దేవరకొండ ఇంటికి కోడలిగా ఫిక్స్ అయినట్టుందే? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు