Vishwambhara: మాట నిలుపుకున్న చిరు.. విలన్ అతడే..!

మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా గత ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలవడమే కాదు హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమాని తెరకెక్కించారు చిరంజీవి. అయితే ఈ సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు సరి కదా కలెక్షన్లు కూడా పెద్దగా రాబట్ట లేకపోయింది.. దీంతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న చిరంజీవి ఫాంటసీ డ్రామాగా విశ్వంభర సినిమాని తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమాకి బింబిసారా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు.. భారీ అంచనాల మధ్య తెరకెక్కబోతున్న ఈ సినిమాని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేస్తామని..అప్పుడే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించింది చిత్ర బృందం..

విశ్వంభర లో రావు రమేష్..
ఇదిలా ఉండగా సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాలో క్యాస్టింగ్ అదిరిపోతుందని డైరెక్టర్ వశిష్ట గతంలోనే చెప్పారు. అనుకున్నట్టుగానే విశ్వంభర నుంచి రోజుకొక అనౌన్స్మెంట్ అభిమానులలో సినిమా పై ఆసక్తిని పెంచుతోంది. ఇకపోతే తాజాగా విశ్వంభరలో విలన్ పాత్ర కోసం విలక్షణ నటుడు రావు రమేష్ ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మెయిన్ విలన్ పాత్ర ఈయనదే అని తెలుస్తోంది.. నిజానికి ఈ పాత్ర కోసం పలువురు బాలీవుడ్ స్టార్స్ ని అనుకోగా.. చిత్ర బృందం ఈ పాత్రకి సరిపోయేవారు ఎవరు దొరకపోవడంతో రావు రమేష్ ని చిత్ర బృందం ఫిక్స్ చేసినట్లు సమాచారం ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రావు రమేష్ గురించి చిరంజీవి మాటల్లో..
ఇదిలా ఉండగా మరొకవైపు ఒక సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో రావు రమేష్ గురించి చిరంజీవి మాట్లాడుతూ.. రావు గోపాల్ రావు లేని స్థానాన్ని రావు రమేష్ భర్తీ చేస్తూ.. ఆయన కంటే ఎన్నో ఉన్నతమైన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. ఇంకా చిన్నవాడివి కాబట్టి ఇంకా ఉన్నత స్థానానికి నువ్వు చేరుకోవాలి..అలానే నా కోరిక ఏంటంటే..నాతో కూడా ఒక సినిమా చెయ్యి.. అని తెలిపారు చిరంజీవి.. ఆ మాట అన్న వెంటనే.. అయినా నాతో ఎందుకు నువ్వు సినిమా చేయడం లేదు.. ఏమై ఉంటుంది.. అంటూ సరదాగా ఆటపట్టించారు కూడా.. అయితే ఇప్పుడు ఈ వీడియోను వైరల్ చేస్తూ..మొత్తానికి చిరు తన మాటను, కోరికను ఇన్నాళ్ళకి తీర్చుకున్నారు.. రావు రమేష్ మొదటిసారి చిరంజీవి సినిమాలో నటిస్తున్నారు అంటూ నెటిజన్స్ పోస్ట్లు పెడుతున్నారు..

- Advertisement -

విశ్వంభరలో హీరోయిన్స్..
ఇక ఇందులో త్రిష మెయిన్ హీరోయిన్ గా ఎంపికయింది అలాగే యంగ్ బ్యూటీ సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి ఇందులో అవకాశాలు దక్కించుకున్నట్లు సమాచారం.. మొత్తానికైతే భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు