Rana : రీమేక్ కాదు, ప్రొడ్యూసర్ ?

కోలీవుడ్ నుండి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లు తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయి. అందులో శింబు, ఎస్, జే సూర్య నటించిన మానాడు కూడా ఒకటి. టైమ్ లూప్ నేపథ్యంలో సాగిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. తమిళ వెబ్ సిరీస్ అయినా, తెలుగులనూ తీసుకువచ్చారు మేకర్స్. టైమ్ లూప్ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. కానీ, మానాడు మాత్రం ఆసక్తి, సాగుతుంది.

అయితే, ఈ వెబ్ సిరీస్ ను తెలుగుతో పాటు హిందీలో రీమేక్ చేయాలని కొంతమంది ప్రయత్నించారు. కానీ ఇప్పటి వరకు మానాడు రీమేక్ కాలేదు. మానాడు రీమేక్ ను రవితేజ చేస్తున్నాడని, అలాగే నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీలో వినిపించాయి. ఇటీవల నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో మానాడు రీమేక్ ను రానా చేస్తున్నాడని చెప్పాడంటూ వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం మరి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మానాడు రీమేక్ ను రానా చేయడం లేదట. కానీ, ఈ రీమేక్ లో భాగం అవుతున్నాడని తెలుస్తుంది. మానాడు రీమేక్ ను నిర్మాత సురేష్ బాబు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అలా, రీమేక్ నిర్మాణ బాధ్యతలను మాత్రమే రానా చూసుకుంటాడని సమాచారం. ప్రస్తుతం రీమేక్ కోసం కాస్ట్ అండ్ క్రూ వెతికే పనిలో రానా ఉన్నాడని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు