Ramcharan: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో పాన్ ఇండియా చిత్రాన్ని లైన్ లో పెట్టిన రామ్ చరణ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన రామ్ చరణ్ తన సినిమాలను కూడా అదే స్థాయిలో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి మరొక సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక న్యూస్ వైరల్ గా మారుతోంది.

అదేమిటంటే బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ గా పేరుపొందిన అనిల్ రావు పూడితో ఒక సినిమాని చేయబోతున్నట్లు టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా డైరెక్టర్ కూడా కథ చెప్పాడని.. కథ కూడా రామ్ చరణ్ కు బాగా నచ్చడంతో ఈ సినిమా స్క్రిప్ట్ ని హోల్డ్ లో పెట్టారని సమాచారం. ఈ విషయం తెలిసి అభిమానుల సైతం సక్సెస్ రేట్ అనిల్ రావు పూడికి ఎక్కువగా ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లోని బెస్ట్ సినిమా అవుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు.

అనిల్ రావిపూడి చెప్పిన కథ రామ్ చరణ్ కి నచ్చినప్పటికీ ప్రస్తుతం చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.. అందుకే డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా రామ్ చరణ్ డేట్ లో అడ్జస్ట్ చేసే వరకు వేరే హీరోతో ఒక సినిమాను చేసి ఆ తర్వాత చేయాలని ఉద్దేశంతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా పాన్ ఇండియా సబ్జెక్టు కావడంతో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం.

- Advertisement -

డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ గ్యాప్ లోనే బాలయ్యతో కలిసి మరొక సినిమాని కూడా చేసే అవకాశం ఉన్నట్లు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. మరి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏ హీరోతో సినిమా చేసి ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేస్తారో తెలియాల్సి ఉంది. గతంలో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా విభిన్నమైన సినిమాని తెరకెక్కించి మంచి సక్సెస్ ని అందుకోవడం జరిగింది. అనిల్ రావిపూడి ఎక్కువగా కామెడీతో, ఎమోషనల్ సన్నివేశాలతో ప్రేక్షకులను బాగా కట్టిపడేస్తూ ఉంటారు. మరి రామ్ చరణ్ తో సినిమా ఎలా ఉండబోతుందో అంటూ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు