PS2: మణిరత్నం తమిళ ఆడియన్స్‌నే నమ్ముకోవాలి..

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఈ స్టోరీని మొత్తం రెండు పార్ట్ లుగా డివైడ్ చేశారు. అందులో పొన్నియిన్ సెల్వన్ 1 గతేడాది సెప్టెంబర్ లో విడుదలైంది. ఈ మూవీ తమిళ ఇండస్ట్రీలో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కానీ మిగతా ఏ భాషల్లో ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. బయ్యర్లు ఈ మూవీ వల్ల చాలా వరకు నష్టపోయారని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి.

తాజాగా పొన్నియిన్ సెల్వన్ 2 విడుదలకు సిద్ధం అవుతుంది. వేసవి కానుకగా ఏప్రిల్ 28న ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపై పొన్నియిన్ సెల్వన్ 1 ప్రభావం చూపిస్తోంది. కోలీవుడ్ లో మినహా అన్ని భాషల్లో ఈ సినిమాకు ఏ మాత్రం బిజినెస్ కావడం లేదు. కోలీవుడ్ లో పొన్నియిన్ సెల్వన్ 1 హిట్ కాబట్టి అక్కడ, రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంటుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పొన్నియిన్ సెల్వన్ 2 పరిస్థితి మరి దారుణంగా ఉందని తెలుస్తోంది. PS2 తెలుగు రైట్స్ ను కొనడానికి ఏ బయ్యర్ కూడా ఆసక్తి చూపించడం లేదని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో పొన్నియిన్ సెల్వన్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ కనీసం 10 కోట్లు కూడా చేయలేదని టాలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

నిజానికి పొన్నియిన్ సెల్వన్ అనేది కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే అర్థమయ్యే స్టోరీ. తమిళ రాజ్యాన్ని పాలించిన రాజుల కథ కాబట్టి, ఇతర ప్రాంతాల వారికి ఈ స్టోరీ పెద్దగా అర్థం కాదు. అలాగే విక్రమ్, కార్తి వంటి సౌత్ మొత్తం గుర్తింపు ఉన్న స్టార్స్ నటించిన పాత్రల పేర్లు కనీసం ప్రేక్షకుల పలకరాకుండ ఉన్నాయి.

ఏది ఏమైనా, మణిరత్నం ఆశలన్నీ తమిళ ఆడియన్స్ పైనే ఉన్నాయని చెప్పొచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు